ఘోరం.. మొబైల్ దొంగతనం చేశాడనే నెపంతో యువకుడిని చితకబాది, రైలు నుంచి తోసేసిన ప్రయాణికులు

By team teluguFirst Published Dec 19, 2022, 1:19 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. అయోధ్య కాంట్ ఓల్డ్ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ లో ఓ యువకుడిని ప్రయాణికులు చితకబాదారు. అనంతరం కదులుతున్న రైలులో నుంచి తోసేశారు. ఈ ఘటనలో యువకుడు మరణించాడు. 

యూపీలో దారుణం వెలుగు చూసింది. రైలులో మొబైల్ దొంగతనం చేశాడనే నెపంతో ఓ యువకుడిని ప్రయాణికులు చితకబాదారు. అనంతరం కదులుతున్న రైలు నుంచి తోసేశారు. దీంతో అతడు తీవ్రగాయాలతో మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ ఫొటో.. భగ్గుమన్న ప్రతిపక్షాలు.. ఎన్నికలకు ముందు ఇదే చివరి అసెంబ్లీ సెషన్

వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి వెళ్లే '14205' అయోధ్య కాంట్ ఓల్డ్ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లో తన మొబైల్ పోయిందని ఓ మహిళ షాజహాన్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఫిర్యాదు చేసింది. అయితే లక్నోలో ట్రైన్ ఎక్కిన ఓ యువకుడు ఫోన్ ను దొంగతనం చేశాడని ప్రయాణికులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని పట్టుకొని దాదాపు అరగంట పాటు చితకబాదాడు. ఇంకా కోపం చల్లారకపోవడంతో నడుస్తున్న ట్రైన్ నుంచి అతడిని తోసేశారు. 

ఉత్తరాఖండ్ లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

దీంతో ట్రాక్ పక్కన ఉన్న ఓవర్ హెడ్ లైన్ స్తంభానికి ఆ యువకుడి తల తగలడంతో తీవ్ర గాయమైంది. అలాగే ఓ కాలు కూడా తెగిపోయింది. దీంతో అతడు మరణించాడు. అయితే ఈ ఘటనను పలువురు ప్రయాణికులు వీడియో తీశారు. తరువాత దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పెళ్లి బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు...

ఈ ఘటనపై బరేలీ జంక్షన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అయితే మృతుడిని నరేంద్ర కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. దీనిపై బరేలీ జీఆర్పీ ఎస్ హెచ్ వో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. “ ఈ ఘటన షాజహాన్‌పూర్ జిల్లాలోని తిల్హార్ ప్రాంతంలో జరిగింది. అయితే బరేలీ పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. దీంతో మేము కేసును తిల్హార్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశాం ’’ అని అన్నారు.

న్యూయార్క్ హౌస్ అగ్నిప్రమాదం.. ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త మృతి..

తిల్హార్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ రాజ్ కుమార్ శర్మ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. “యువకుడు గాయాలతో మరణించాడని పోస్టుమార్టం నివేదికలో పేర్కొంది. మేము వైరల్ అయిన వీడియోను పరిగణనలోకి తీసుకున్నాం. సమగ్ర దర్యాప్తు తర్వాత నిందితుల జాబితాలో మరి కొందరిని చేర్చే అవకాశం ఉంది. ఒక నిందితుడిని అయితే జైలుకు పంపించాం. ’’ అని తెలిపారు.

click me!