అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లాలి..!? అయోమయంలో పడ్డ ప్రయాణీకుడు 

Published : Nov 23, 2022, 04:57 PM ISTUpdated : Nov 23, 2022, 04:58 PM IST
అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లాలి..!? అయోమయంలో పడ్డ ప్రయాణీకుడు 

సారాంశం

ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ బుకింగ్ సైట్ లో సాంకేతిక లోపం తలెల్లింది. దీంతో ఓ ప్రయాణీకుడు గందరగోళానికి గురయ్యాడు. తాను వెళ్లే ప్రదేశం.. తాను బయలు దేరే ప్రదేశం ఒకేలా చూపించి..తనని కన్ ప్యూజ్ చేసింది.

ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్ అయింది. క్రమేణా ప్రపంచం మొత్తం మన గుప్పిట్లోకి వస్తోంది. ఇప్పటికీ మనం చాలా వరకు మ్యానువల్ చేసే పనులను మరిచిపోయాం. బ్యాంకింగ్, షాపింగ్, పుడ్ ఆర్డర్ చేయడం, టిక్కెట్లను బుక్ చేసుకోవడం ఇలా చాలా పనులను ఆన్‌లైన్‌లోనే చేస్తున్నాం. ఆన్ లైన్ మన జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా.. సేవలు సౌలభ్యంగా మన చేరువ అవుతున్నాయి. కానీ..డిజిటలైజేషన్‌ లో ఏర్పడే సాంకేతిక లోపాలు మనల్ని కలవరపెడుతాయి. గందరగోళంలో పడేస్తాయి.

తాజాగా ఆన్‌లైన్‌లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఓ ప్రయాణికుడికి ఇలాంటి సమస్య ఎదురైంది. సంబంధిత విమానయాన సంస్థ బుకింగ్ సైట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో గందరగోళానికి గురయ్యాడు. తాను వెళ్లే ప్రదేశం.. తాను బయలు దేరే ప్రదేశం ఒకేలా చూపించి..తనని కన్ ప్యూజ్ చేసింది. 

వివరాల్లోకెళ్లే.. ఆదిత్య వెంకటేష్ అనే యువకుడు  హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లాలని AirAsia ఫ్లైట్‌ను బుక్ చేసుకోవాలని భావించాడు. సంబంధిత సైట్ కు వెళ్లి.. ఫ్లైట్‌ను బుక్ చేశాడు. కానీ.. డిపార్చర్ పాయింట్ , డెస్టినేషన్‌ పాయింట్  బెంగుళూరు గా చూపించింది. అంటే.. టికెట్ బెంగుళూర్ నుండి బెంగుళూరుకు బుక్ చేస్తున్నట్లు కన్ఫర్మేషన్ పాపప్ చూపించింది. దీంతో కంగుతిన్న ఆదిత్య సంబంధితన సైట్ ను రిప్రెష్ చేసి చూశాడు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆదిత్య  ఫేజ్ ను స్రీన్ షాట్ చేసి.. సమస్యకు పరిష్కారం కోసం ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ఆ పోస్టులో అతడు ఇలా రాసుకొచ్చాడు. "హాయ్ @AirAsiaIndia ఇది నిజంగా గందరగోళంగా ఉంది. నేను హైదరాబాద్ నుంచి బెంగళూర్ కు టిక్కెట్‌ బుక్ చేస్తే.. ఇలా వచ్చింది. నేను నిజంగా  ఎక్కడికి ఎక్కడి వెళ్తాను? అసలు ఎక్కడ నుండి ఎక్కడి బయలుదేరుతాను?"అని ప్రశ్నించారు. వెంకటేష్ హైదరాబాద్ నుండి బెంగళూరుకు విమానాన్ని బుక్ చేయాలనుకున్నప్పుడు.. పాప్అప్ ఒక సమయంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గమ్య స్థలంగా చూపించింది. 

ఈ ప్రశ్నను AirAsia స్పందిస్తూ.. "సాంకేతిక లోపం ఉండవచ్చు. దయచేసి పేజీని రిఫ్రెష్ చేసి.. మరోసారి  బుకింగ్ చేయండి" అని బదులిచ్చింది. సమస్య పరిష్కారం అయ్యేలా కనిపించలేదు. అని తనదైన శైలిలో స్పందించారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu