Parliament Security Breach: పార్లమెంట్ లో గ్యాస్ దాడి ఎందుకు చేశారంటే..?

By Mahesh Rajamoni  |  First Published Dec 14, 2023, 10:42 AM IST

Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన ఆరుగురిపై కేసు న‌మోదైంది. ఈ ఆరుగురూ నాలుగేళ్లుగా ఒకరికొకరు తెలుసుననీ, కొద్ది రోజుల క్రితం ఈ దాడి కుట్రను రచించారని సమాచారం. నిందితులు సోషల్ మీడియాలో ఒకరికొకరు టచ్ లో ఉంటూ బుధవారం పార్లమెంటుకు వచ్చే ముందు రెక్కీ చేశారు.
 


Parliament Security Breach: దేశంలో అత్యంత సుర‌క్షిత‌మైన ప్రాంతాల్లో ఒక‌టి, భార‌త ప్ర‌జాస్వామ్య గుండెకాయ‌గా ఉన్న పార్ల‌మెంట్ పై బుధ‌వారం దాడి జ‌రిగింది. పార్లమెంటు జీరో అవర్ లో ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని పసుపు రంగులో గ్యాస్ ను వెదజల్లుతున్న పొగ డబ్బాలతో సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్ సభ ఛాంబర్ లోకి దూసుకెళ్లి గంద‌ర‌గోళం సృష్టించారు. ఏం జ‌రుగుతుందో గంద‌ర‌గోళం నెల‌కొన్న త‌రుణంలో ప‌లువురు ఎంపీలు నిందితుల‌ను ప‌ట్టుకుని చిత‌కొట్టారు. ఆపై సెక్యూరిటీ అధికారుల‌కు అప్ప‌గించారు. 2001లోపార్లమెంట్ పై దాడి జ‌రిగిన రోజునే ఇలా మ‌రోసారి క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాల‌తో దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. పార్లమెంట్ భ‌ద్ర‌త ఎంట‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. 

పార్ల‌మెంట్ లో ఇలా దాడి ఎందుకు చేశారు..? 

Latest Videos

బుధవారం లోక్ సభలో చొరబాటు డ్రామా ప్రారంభం కావడంతో మొదట స్పందించిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివాల్ స్పందిస్తూ.. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు యువకులు ఛాంబర్ లోకి దూకగా, ఒక మహిళ బాక్స్ నుంచి వారిని ప్రోత్సహిస్తూనే ఉందని, నాలుగో మహిళ మార్షల్స్ కు స్లిప్ ఇచ్చి ఉంటారని పేర్కొన్నారు. నిందితుడు సాగర్ శర్మను పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించే ముందు కొన్ని దెబ్బలు కొట్టిన ఎంపీల్లో ఒకరైన బేనివాల్ మాట్లాడుతూ.. ఇద్దరు యువకులు లోక్ సభ ఛాంబర్ లోకి దూకిన సమయంలో సుమారు 150 మంది ఎంపీలు సభలో ఉన్నారు.

పార్లమెంట్ దాడిలో వాడిన 'క‌ల‌ర్ గ్యాస్ డ‌బ్బాలు' ఎంటో తెలుసా?

'మేము వారిని పట్టుకుని కొట్టినప్పుడు, వారు నిరసన తెలపడానికి మాత్రమే మాత్ర‌మే వ‌చ్చామ‌నీ, కొట్టవద్దని వారు మమ్మల్ని వేడుకున్నారు. దేనికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని తాము వారిని అడిగామని, కానీ వారు స్పష్టత ఇవ్వలేదన్నారు. అలాగే, డబ్బాల నుంచి వెలువడిన పొగతో పలువురు ఎంపీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో పార్లమెంటులో గందరగోళం నెలకొంది... వారు కావాలనే స్పీకర్ కుర్చీ వైపు వెళ్తున్నారని, వారు అక్కడికి చేరుకునేలోపే వారిని అదుపులోకి తీసుకున్నామని' తెలిపిన‌ట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఈ దాడి పరిస్థితిని ఎదుర్కొవ‌డంలో ధైర్యసాహసాలకు ప్రశంసలు అందుకున్న కాంగ్రెస్ సభ్యుడు గుర్జీత్ సింగ్ ఔజ్లా చాంబర్ లోకి దూకిన రెండో చొరబాటుదారుడిని ఎదుర్కుని పొగ డబ్బాను లాక్కుని బయటకు విసిరేశారు. ఆ తర్వాత ఆ డబ్బాలో పసుపు రంగు పొగ ఉందని, అందులో ఏముందో తెలియడం లేదని, సాధ్యమైనంత వరకు ఆ డబ్బాను తొలగించడానికి ప్రయత్నించానని ఆయ‌న మీడియాకు చెప్పారు.

పార్ల‌మెంట్ దాడి వెనుక నిరుద్యోగం, మ‌ణిపూర్ సంక్షోభం, మ‌హిళా కోటా.. 

పార్లమెంట్ భ‌ద్ర‌తా ఉల్లంఘ‌న‌కు సంబంధించిన కేసులో ప్ర‌ధాన నిందితులుగా సాగర్, మనోరంజన్, నీల్, అమోల్, విశాల్, లలిత్ లు ఉన్నారు. ఈ ఆరుగురు నిందితులు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారైనప్పటికీ ఒకరికొకరు తెలుసు. వీరు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌రిచ‌యాలు పెంచుకున్నారు. బుధవారం పార్లమెంటులో ఏం చేస్తున్నారో వారి కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. వారంతా నిరుద్యోగులే. రైతుల నిరసన, మణిపూర్ సంక్షోభం, నిరుద్యోగంపై తాము కలత చెందామని ప్రాథమిక విచారణలో అన్మోల్ పోలీసులకు తెలిపాడు. వారు ఏ సంస్థలో పనిచేశారో లేదో ఇంకా తెలియరాలేదు. ఎంఏ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్, నెట్ పాసైన తర్వాత పోటీ పరీక్షలకు చదువుతున్న విద్యార్థిని నీలమ్. మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన అమోల్.. మనోరంజన్ డి ప్రతాప్ సింహా నియోజకవర్గమైన మైసుసుకు చెందినవారు. వీరందరికీ సోషల్ మీడియా ద్వారా గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది.

Parliament Security Breach: 22 ఏండ్ల నాటి పార్ల‌మెంట్ భయాన‌క దాడిని గుర్తుచేసేలా..

click me!