పార్లమెంటుపై దాడి చేసిన వారిపై ఉపాతో సహా పలు సెక్షన్ల కింద కేసుల నమోదు చేశారు.
ఢిల్లీ : బుధవారం ఢిల్లీలో పార్లమెంటుపై దాడికి దిగిన నిందితులపై ఉపా కేసులు పెట్టారు పోలీసులు. పార్లమెంట్ పై దాడి ఘటన బుధవారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పట్టుబడిన నిందితులపై అనేక కేసులు నమోదు చేశారు పోలీసులు. వీటిలో ఉపాతో సహా అనేక సెక్షన్లు ఉన్నాయి.
పార్లమెంట్ లో దాడి ఘటనను అధికార, విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. పార్లమెంట్ పై దాడి ఘటనలో నేడు కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు చేసింది. భద్రతా ఉల్లంఘన ఘటనపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. రాజ్యసభలో రూల్ 267 కింద ఎంపీ నజీర్ హుస్సేన్ బిజినెస్ సస్పెన్స్ నోటీస్ ఇచ్చారు.
దాడి ఘటనపై నేడు ఇండియా కూటమి పార్లమెంటరీ పక్ష నేతల భేటీ జరగనుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. దాడి ఘటనను రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. దీనికోసం ఇండియా కూటమి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది.
మరోవైపు పార్లమెంట్లో అలజడి ఘటనతో సెక్యూరిటీ ఏజెన్సీలు అలర్ట్ అయ్యాయి. పార్లమెంటు ఆవరణలో భారీగా భద్రతా బలగాలు మొహరించాయి. పట్టుబడ్డ నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పార్లమెంటులో సందర్శకుల ద్వారం మూసివేశారు.
అధికారులు పార్లమెంటు లోపలికి సందర్శకులను అనుమతించడం లేదు.