Parliament Security Breach: 22 ఏళ్ల క్రితం పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగిన రోజునే లోక్ సభలోకి చొరబడిన ఇద్దరు దుండగులు కలర్ గ్యాస్ డబ్బాలతో దాడి చేశారు. ఈ దాడిచేసిన వారికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిందని సమాచారం.
Lok sabha Security Breach: పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పార్లమెంట్‌లో నాటకీయమైన కలర్ గ్యాస్ డబ్బాలతో దాడి చేస్తూ.. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఘటన భద్రతా సంస్థల ప్రాథమిక దర్యాప్తులో ఉల్లంఘన బాగా సమన్వయం చేయబడిందనీ, ఏడుగురు వ్యక్తులచే ఖచ్చితంగా ప్రణాళికలో భాగంగా ఈ చర్యలకు పాల్పడ్డారని గుర్తించారు. నిందితుల్లో ఆరుగురిని పట్టుకున్నారు. ఏడో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. నిందితులు ఒకరికొకరు నాలుగేళ్లుగా తెలుసుననీ, కొద్దిరోజుల క్రితమే పథకం పన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిందితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఒకరికొకరు టచ్‌లో ఉన్నారు. బుధవారం పార్లమెంటుకు వచ్చే ముందు రెక్కీ చేశారు. ఆసక్తిరమైన విషయమేంటంటే విరంతా కూడా నిరుద్యోగులని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఎంఫిల్ డిగ్రీలు చేసి..
undefined
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితులుగా సాగర్, మనోరంజన్, నీల్, అమోల్, విశాల్, లలిత్ లు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారైనప్పటికీ ఒకరికొకరు తెలుసు. వీరు సోషల్ మీడియా వేదికగా పరిచయాలు పెంచుకున్నారు. వీరు నిరుద్యోగులని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రైతుల నిరసన, మణిపూర్ సంక్షోభం, నిరుద్యోగంపై తాము కలత చెందామని ప్రాథమిక విచారణలో అన్మోల్ పోలీసులకు తెలిపాడు. వారు ఏ సంస్థలో పనిచేశారో లేదో ఇంకా తెలియరాలేదు. ఎంఏ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్, నెట్ పాసైన తర్వాత పోటీ పరీక్షలకు చదువుతున్న విద్యార్థిని నీలమ్. మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన అమోల్.. మనోరంజన్ డి ప్రతాప్ సింహా నియోజకవర్గమైన మైసుసుకు చెందినవారు. నిందుతులుగా ఉన్ననీలం.. బీఏ, ఎంఏ, బీఈడీ, ఎంఈడీ, సీటీఈటీ, నెట్, ఎంఫిల్ డిగ్రీలు చేశారనీ, ఇంకా ఉద్యోగం రాలేదని నీలం సోదరుడు రామ్‌నివాస్ తెలిపాడు. అలాగే, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదనీ, ఆమె కూడా పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి జింద్‌కు వెళ్లినట్లు పేర్కొన్నాడు.
Parliament Security Breach: పార్లమెంట్ పై దాడి.. రంగంలోకి ప్రత్యేక కమిటీ
గురుగ్రామ్ లోనే బస..
ఢిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ ఐదుగురు వ్యక్తులు మూడు రోజుల క్రితం తమ ఇళ్ల నుంచి గురుగ్రామ్ కు చేరుకుని అక్కడ స్నేహితుడి ఇంట్లో బస చేశారు. దీని తరువాత, ఇద్దరు వ్యక్తులు పార్లమెంటు లోపల.. మరో ఇద్దరు వ్యక్తులు పార్లమెంటు వెలుపల కలర్ గ్యాస్ డబ్బాలతో నిరసన తెలిపారు. సభలోకి ప్రవేశించిన వారిలో సాగర్ శర్మ (లక్నో), డి.మనోరంజన్ (మైసూరు)లను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న సమయంలో అమోల్ షిండే (లాతూర్), మధ్య వయస్కురాలైన మహిళ నీలంలను పార్లమెంటు వెలుపల నిర్బంధించారు. ఐదో వ్యక్తిగా గురుగ్రామ్ కు చెందిన లలిత్ ఝా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు నిందితులు భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ అనే ఫేస్ బుక్ గ్రూపులో భాగమనీ, గత ఏడాది నుంచి ఒకరికొకరు తెలుసునని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో అనుమానితులను ప్రశ్నిస్తున్న ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
గంటల ముందే రెక్కీ..
"పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అమోల్ షిండేతో సహా ముగ్గురు వ్యక్తులు రెక్కీ చేశారు. వీళ్లకు సీట్లు, వీక్షకుల గ్యాలరీ గురించి తెలుసు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పాత పార్లమెంటులో జరుగుతుండగా, శీతాకాల సమావేశాలు కొత్త పార్లమెంటులో జరుగుతున్నాయి. సాగర్ శర్మ, డి.మనోరంజన్ బుధవారం పార్లమెంటులోకి ప్రవేశించడానికి ఉపయోగించిన పాస్ పై మైసూరుకు చెందిన ఎంపీ ప్రతాప్ సింహా సంతకాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సింహా కుటుంబానికి మనోరంజన్ సుపరిచితుడని పోలీసులు తెలిపారు. అయితే వర్షాకాల సమావేశాల్లో వీరు ఏ ఎంపీ ద్వారా వచ్చారో ఇంకా స్పష్టత రాలేదు. వర్షాకాల సమావేశాల చివరి రోజైన ఆగస్టు 10న అమోల్ షిండే కూడా కర్తవ్య పథ్ నుంచి తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సమయంలో ఆయన కూడా నగరంలోనే ఉన్నట్లు హిందుస్తాన్ టైమ్స్ కథనం పేర్కొంది.
ఉపా కింద కేసు.. ఎనిమిది మంది సిబ్బంది సస్పెండ్..
యూఏపీఏ కింద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు యాంటీ టెర్రర్ యూనిట్ స్పెషల్ సెల్ దర్యాప్తు చేస్తోంది. నిందితులందరినీ స్పెషల్ సెల్ కు అప్పగించి పదుల సంఖ్యలో బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. పలు చోట్ల సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. దర్యాప్తు సంస్థలు దీనిని దేశ వ్యతిరేక సంఘటనగా పరిగణిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ కేసులో కేంద్ర హోంశాఖ సిట్ ను ఏర్పాటు చేసింది. సీఆర్పీఎఫ్ డీజీ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటైంది. ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఎనిమిది మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.
పార్లమెంట్ దాడిలో వాడిన 'కలర్ గ్యాస్ డబ్బాలు' ఎంటో తెలుసా?