లో‌క్‌సభలో కలర్ స్మోక్ నిందితులకు సైకో అనాలిసిస్ టెస్టు: ఈ పరీక్ష ఏమిటీ?తెరపైకి మనోరంజన్

By narsimha lode  |  First Published Dec 22, 2023, 3:47 PM IST

పార్లమెంట్ లో  కలర్ స్మోక్ వదిలిన నిందితులను  పోలీసులు విచారిస్తున్నారు.ఈ విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. 


న్యూఢిల్లీ: ఈ నెల  13వ తేదీన  లోక్ సభలో  కలర్ స్మోక్ వదిలిన నిందితులకు  పోలీసులు మానసిక విశ్లేషణ పరీక్షలు (సైకో అనాలిసిస్ టెస్ట్ )నిర్వహించారు. 

లోక్ సభ లో  కలర్ స్మోక్ వదిలిని నిందితలకు  ఢిల్లీ కోర్టు  జనవరి 5వ తేదీ వరకు  స్పెషల్ సెల్ కస్టడీకి పంపింది. లోక్ సభలో  కలర్ స్మోక్ వదిలిన ఘటనకు  లలిత్ ఝా కీలక సూత్రాధారిగా భావించారు. అయితే  దీని వెనుక  మనోరంజన్ అనే వ్యక్తి  సూత్రధారి అని లలిత్ ఝా  పోలీసుల విచారణలో వెల్లడించారు.  మనోరంజన్ ఒక సంస్థను సృష్టించాలనుకున్నాడని  లలిత్ ఝా చెప్పారు.ఈ సంస్థలో చేరేలా యువకులను బ్రెయిన్ వాష్ చేసే బాధ్యతలను సాగర్ శర్మకు అప్పగించినట్టుగా ఈ పరీక్షల్లో తేలింది. తన సహాయకులతో పాటు తనపై  కూడా కఠినమైన చట్ట వ్యతిరేక కార్యలాపాల నివారణ చట్టం (ఉపా) కింద అభియోగాలు మోపుతారని  ఊహించలేదని లలిత్ ఝా చెప్పారని సమాచారం. లోక్ సభ వద్ద కలర్ స్మోక్ వదిలినందుకు  బెయిల్ పై త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందని నిందితులు భావించారని  పోలీసుల విచారణలో  ఝా చెప్పారు.  అయితే  పోలీసులు  ఉపా చట్టం కింద కేసులు నమోదు చేస్తారని ఊహించలేదు. 

Latest Videos

నిందితులు ఉపయోగించిన సెల్ ఫోన్లను  లలిత్ ఝా  దగ్దం చేశారు. అయితే  నిందితులు  ఉపయోగించిన ఫోన్ నెంబర్లతో కొత్త సిమ్ కార్డులతో  ఈ నెంబర్లను  పోలీసులు యాక్టివేట్ చేశారు.  కౌడ్ టెక్నాలజీ ద్వారా  నిందితులు ఉపయోగించిన  మొబైల్స్ నుండి డేటాను పోలీసులు రికవరీ చేస్తున్నారు. 2001 డిసెంబర్  13న పార్లమెంట్ పై ఉగ్రమూకలు దాడి చేసిన  రోజునే  వీరు కలర్ స్మోక్ ను వదిలి  హంగామా చేశారు.  ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  అరెస్టైన వారిలోని మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ షిండే, నీలం ఆజాద్ లున్నారు. లలిత్ ఝాకు  మహేష్ కుమావత్  సహాయం చేశారు. మణిపూర్ అశాంతి, నిరుద్యోగం, రైతుల సమస్యలపై దేశ ప్రజలను తమ వైపునకు తిప్పుకొనేందుకు  కలర్ స్మోక్ ఉపయోగించారని పోలీసుల విచారణలో తెలిపారని సమాచారం

మానసిక విశ్లేషణ పరీక్షలు ఏమిటీ.

నేరాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల మానసిక స్థితిని అర్ధం చేసుకోవడానికి మానసిక విశ్లేషణ పరీక్షలు నిర్వహిస్తారు.  నిందితుల అలవాట్లు, దినచర్యలు, గ్రహణశక్తి, ప్రవర్తన తెలుసుకోవడం ఈ పరీక్ష ఉద్దేశ్యం. మానసిక వైద్యులు పరీక్షలను నిర్వహిస్తారు.  నిందితులను నిర్ధిష్ట ప్రశ్నలు అడుగుతారు.  నిందితులు చెప్పిన సమాధానాల ఆధారంగా  వారు ఎలా ఏ కారణాలతో నేరం చేశారన్నది నిర్ధారిస్తారు.

తాజాగా ఢిల్లీ పోలీసులు శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు  ఆఫ్తాబ్ పూనావాలా సహా, ఢిల్లీలో  16 ఏళ్ల బాలిక సాక్షి హత్యకు కారణమైన సాహిల్  ఖాన్ కు ఈ పరీక్షలు నిర్వహించారు. 


 

click me!