నర్మదా వ్యాలీ ప్రాంతంలో డిసెంబరులో ముగ్గురు శాస్త్రవేత్తలు డైనోసార్లకు సంబంధించి ఓ వర్క్‌షాప్ నిర్వహించారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో శిలాజ డైనోసార్ గుడ్ల ఆవిష్కరణ జరిగిందని వివరించారు.
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఉన్న ఒక గ్రామస్తులు తమకు తెలియకుండానే డైనోసార్ గుడ్లను.. కొన్నేళ్లుగా కులదేవతలుగా పూజిస్తున్నారని ఇటీవల శాస్త్రవేత్తల బృందం కనుగొంది. గ్రామం ఉన్న నర్మదా వ్యాలీ ప్రాంతం లక్షల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ యుగంతో ముడిపడి ఉంది. డైనోసార్ గుడ్లు ఇక్కడ కనుగొనడంతో, స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
డైనోసార్ ఫాసిల్స్ పార్క్, శాస్త్రీయ, అభివృద్ధి పనులను పరిశీలించడానికి ముగ్గురు శాస్త్రవేత్తలు డాక్టర్ మహేష్ ఠక్కర్, డాక్టర్ వివేక్ వి కపూర్, డాక్టర్ శిల్పాల వర్క్‌షాప్ నిర్వహించారు. ఆ తర్వాత డిసెంబర్‌లో ఈ ఆవిష్కరణ జరిగింది.
వర్క్‌షాప్ సమయంలో, వెస్టా పటేల్ అనే స్థానికుడు గుండ్రని రాళ్లను పూజించే సంప్రదాయమైన 'కాకడ్ భెరవ్' గురించి వారికి తెలియజేశాడు. దీంతో కాస్త ఆసక్తితో వాటిని గమనించగా వాటిల్లో కొన్ని డైనోసార్ గుడ్లు ఉన్నట్టుగా తేలింది.
ఇండియాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా జేఎన్.1 వైరస్:2,669కి చేరిన కేసులు
'కాకడ్' అని పిలువబడే ఈ రాళ్లను పొలాల సరిహద్దుల్లో పూజిస్తున్నారు. డైనోసార్ శిలాజాల పార్క్ ప్రాంగణంలో అలాంటి రెండు రాళ్లను చూడవచ్చు. స్థానిక డైనోసార్ నిపుణుడు, విశాల్ వర్మ మాట్లాడుతూ, ఈ శిలాజాల సంరక్షణ, వాటితో ముడిపడి ఉన్న సంప్రదాయాన్ని ప్రపంచానికి ప్రదర్శించవచ్చని, ఇది పార్కును మరింత ఆకర్షణీయంగా ఉంచుతుందని పేర్కొన్నారు.
"కుటుంబ దేవతలుగా భావించే గుండ్రని రాళ్లు గుడ్లు మాత్రమే కాదు, స్థానిక పూజా ఆచారాలలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంజూర చెట్ల క్రింద ఉంచిన ఈ రాళ్లను తరతరాలుగా పూజిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూలాజికల్ పార్క్, ఈ సంప్రదాయాలను సంరక్షించడం పార్క్, సాంస్కృతిక గొప్పతనానికి అంతర్భాగమవుతుంది" అని వర్మ వివరించారు.
సుమారుగా 18 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన డైనోసార్ గుడ్లు బాగా సంరక్షించబడ్డాయి. కొన్ని ప్రజల సందర్శణ కోసం ఉంచబడ్డాయి. మరికొన్నింటిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామస్తులు ఈ 'రాళ్ల'కు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసేవారని.. ఈ రాళ్లు డైనోసార్ గుడ్లు అని తేలడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని స్థానికంగా ఉండే వెస్టా మాండ్లోయ్ అన్నారు.