అధిర్ రంజన్ సస్పెన్షన్‌పై విపక్షాల నిరసన: లోక్‌సభ వాయిదా

Published : Aug 11, 2023, 11:45 AM ISTUpdated : Aug 11, 2023, 11:53 AM IST
అధిర్ రంజన్ సస్పెన్షన్‌పై విపక్షాల నిరసన: లోక్‌సభ వాయిదా

సారాంశం

లోక్ సభలో  కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్  చౌదరిపై  సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ విషయమై నిరసనకు దిగాయి. దీంతో  గందరగోళం నెలకొంది. దరమిలి సభను  మధ్యాహ్నం  12  గంటల వరకు  వాయిదా వేశారు స్పీకర్.

న్యూఢిల్లీ:లోక్‌సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం నాడు మధ్యాహ్నం  12 గంటల వరకు  వాయిదా పడింది.లో‌క్‌‌సభ లో  కాంగ్రెస్ పార్టీ పక్ష నేత  అధిర్ రంజన్ పై సస్పెన్షన్ పై  విపక్షాలు  ఇవాళ సభలో  నిరసనకు దిగాయి.లోక్ సభ ప్రారంభం కాగానే  అధిర్ రంజన్ పై  సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్  చేశారు. ఈ విషయమై  లోక్ సభలో  విపక్షాలు  ఆందోళనకు దిగాయి. దరిమిలా  లోక్ సభ ను  మధ్యాహ్నం 12 గంటల వరకు  వాయిదా పడింది.

లోక్ సభలో  కాంగ్రెస్ పక్ష  నేత అధిర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు. ప్రధాని మోడీనుద్దేశించి వ్యాఖ్యలు  చేశారు.  ఈ విషయమై ప్రివిలేజ్ కమిటీ  సూచన మేరకు అధిర్ రంజన్  పై సస్పెన్షన్ వేటు పడింది.ఈ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.  మరోవైపు ఇదే విషయమై రాజ్యసభలో విపక్ష నేత  మల్లికార్జున ఖర్గే  ప్రస్తావించారు. 

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!