బ్లడ్ క్యాన్సర్ నయం అవుతుందని నమ్మిన తల్లిదండ్రులు ఓ బాలుడిని హరిద్వార్ (haridwar) కు తీసుకెళ్లారు. అక్కడి గంగానదిలో పదే పదే ముంచడం వల్ల ఆ బాలుడు ఊపిరాడక (The boy's parents drowned him in the Ganga river as he would be cured of cancer. A dead boy) మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral) గా మారాయి.
దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోంది. టెక్నాలజీ అందనంత దూరం నుంచి మన పల్లెల్లోకి వచ్చింది. అంతరిక్షంలోకి రాకెట్లు పంపగలుగుతున్నాం. చందమామపై కాలు మోపగులుతున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. క్షణాల్లో తెలుసుకోగులుగుతున్నాం. కానీ భారత మూలాల్లో ఇప్పటికీ దాగి ఉన్న కొన్ని మూఢ నమ్మకాలను, సామాజిక దూరాచాలను తొలగించలేకపోతున్నాం.
సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారు, విజ్ఞాన వంతులైన వారు కూడా అజ్ఞానంగా ప్రవర్తించి, మూఢ నమ్మకాల వల్ల సొంత బిడ్డలనే ఘోరంగా హతమార్చిన ఘటనలు గతంలో చూశాం. తాజాగా హరిద్వార్ లో కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడికి గంగానదిలో పవిత్ర స్నానం చేయిస్తే అద్భుతంగా నయం అవుతుందని భావించిన తల్లిదండ్రులు, అత్త దాదాపు 15 నిమిషాల నీటిలో ముంచి ఉంచారు. దీంతో బాలుడు మరణించాడు. అయితే ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులను వారించడమే కాకుండా.. ఘోరం జరిగిన తరువాత విచిత్రంగా ప్రవర్తించారు.
undefined
హరిద్వార్ సిటీ పోలీస్ ఛీఫ్ స్వతంత్ర కుమార్ ‘ఎన్డీటీవీ’, బాలుడి తల్లిండ్రులు మీడియాతో తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఢిల్లీకి చెందిన రాజ్ కుమార్, శాంతిలకు రవి అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఆ బాలుడు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. బాలుడి బ్లడ్ క్యాన్సర్ సోకిందని, ఇక బతికే అవకాశం లేదని డాక్టర్లు తెలిపారు.
अंधविश्वास ने एक 7 साल के बच्चे की जान ले ली ...!!
ब्लड कैंसर से पीड़ित बच्चे को उसकी मौसी ने चमत्कार की आस में करीब पांच मिनट तक गंगा में डुबकियां लगवा दीं ....!!
बच्चे की मौत हो गई है ....!! pic.twitter.com/kLCPcHsIY8
కానీ బాలుడిపై ఉన్న ప్రేమతో, కుమారుడిని ఎలాగైనా బతికించుకోవాలనే కోరికతో ఆ తల్లిదండ్రులు దైవ జోక్యం అవసరమని భావించారు. అయితే ఎవరు చెప్పారో తెలియదు గానీ.. హరిద్వార్ లోని గంగానదిలో పవిత్ర స్థానం చేస్తే అద్భుతం జరుగుతుందని, బాలుడి క్యాన్సర్ నయమవుతుందని వారికి తెలిసింది. దీంతో రవిని, బాలుడి మేనత్త సుధను తీసుకొని రాజ్ కుమార్, శాంతిలు హరిద్వార్ చేరుకున్నారు. అందరూ కలిసి నది దగ్గరకు వెళ్లారు.
బాలుడి మేనత్త ముందుగా రవి తల్లిదండ్రులను గంగా నదిలో ముంచి, బయటకు తీసింది. అనంతరం బాలుడి తల్లిదండ్రులు నీటిలో నిలబడి మంత్రాలు చదవసాగారు. తరువాత బాలుడిని మేనత్త పదే పదే నీటిలో ముంచింది. దీంతో బాలుడు పెద్దగా కేకలు వేశాడు. కొంత సమయం తరువాత కేకలు ఆగిపోయాయి. దీనిని గమనించిన అక్కడి భక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారు హింసాత్మకంగా ప్రవర్తించారు. వారి పనిని అలాగే కొనసాగించారు. కానీ ఓ వ్యక్తి బలవంతంగా బాలుడిని తీసుకొని మెట్లపైకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. అయితే అప్పటికే బాలుడు చనిపోయాడు.
అయితే బాలుడి డెడ్ బాడీ దగ్గర కూర్చొన్న అత్త విచిత్రంగా ప్రవర్తించింది. ‘‘పిల్లవాడికి ప్రాణం తిరిగి వస్తుంది’’ అంటూ విచిత్రంగా నవ్వుతూ, పిచ్చి పట్టిన మహిళలా ప్రవర్తించింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాలుడిని హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి అత్త సుధతో పాటు తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. బాలుడి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నీటిలో మునిగిపోవడం మరణానికి కారణం కాదని తేలింది. మరి చలితో చనిపోయాడా లేక ఇంకా ఏ కారణం చేతైనా చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాలుడిని అత్త నీటిలో ముంచడం, పక్కనే తల్లిదండ్రులు నిలబడి మంత్రాలు చదవడం, బాలుడిని బయటకు తీసుకొచ్చిన తరువాత అత్త విచిత్రంగా ప్రవర్తించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.