మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పన్నా బస్సు ప్రమాద ఘటనపై ఏడేళ్ల తర్వాత తీర్పు వెలువడటం గమనార్హం. 2015 మే 4న అరవై ఐదు మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి 14 అడుగుల లోయలో పడిపోయింది. ఇంధన ట్యాంకు బద్దలవడం తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
భోపాల్ : బస్సును మితిమీరిన వేగంతో నడుపుతూ… మెల్లగా వెళ్ళమంటూ పదేపదే చేస్తున్న విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చి, 22 మంది మృతికి కారణమయ్యాడు ఓ బస్సు డ్రైవర్. తాజాగా అతడికి నూట తొంభై ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ Madhya Pradesh లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది.
రాష్ట్రంలో Panna bus accident ఘటనపై ఏడేళ్ల తర్వాత తీర్పు వెలువడటం గమనార్హం. 2015 మే 4న అరవై ఐదు మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి 14 అడుగుల లోయలో పడిపోయింది. ఇంధన ట్యాంకు బద్దలవడం తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
undefined
22 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 12 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు కూడా కోర్టు తేల్చింది. ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు ఉండాల్సిన అత్యవసర ద్వారాన్ని మూసివేసి అదరనంగా సీటు ఏర్పాటు చేశారని తేలింది. దీంతో డ్రైవర్ పదేళ్ల చొప్పున 19 విడతలుగా జైల్లో గడపాలని తీర్పు వెలువరించిన కోర్టు, బస్సు యజమానికి కూడా 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ.. చివరికి.. !
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 16న మరో బస్సు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 15న ప్రకాశం జిల్లాలో జంగారెడ్డిగూడెం సమీపంలోని జరిగిన ప్రమాదంలో డ్రైవర్ తో సహా పది మంది ప్రయాణీకులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆ తరువాత 16వ తేదీన ప్రకాశం జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.
జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణీకులు వెంటనే బస్సు నుంచి దూకేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తప్పించుకున్నారు. కానీ ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమయింది.
ఆన్ లైన్ గేమ్స్ వ్యసనం.. అప్పులపాలై భార్యాపిల్లలను చంపి.. వ్యక్తి ఆత్మహత్య...
ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్నది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో అంతా బస్సులోని నుంచి దూకి ప్రాణాలకు కాపాడుకున్నారు. బస్సు మొత్తం అగ్నికి ఆహుతయింది. అయితే ప్రయాణికుల లాగేజ్ బస్సులోనే ఉండి పోవడంతో బస్సులోనే కాలి బూడిదయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు బస్సు సిబ్బంది వెల్లడించారు.ఈ ప్రమాదం నుంచి కొత్త మంది తేరుకోలేక పోతున్నారు. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమయంలోబస్సులో 8 మంది ప్రయాణికులు, ముగ్గురు బస్సు సిబ్బంది ఉన్నారు.