బ్యాట్ తో భార్య‌ను కొట్టి.. ఇద్ద‌రు పిల్ల‌ల‌పై త‌ల‌దిండు పెట్టి.. కిరాత‌కంగా మారిన ఐటీ ఉద్యోగి..

Published : Jan 03, 2022, 10:33 AM IST
బ్యాట్ తో భార్య‌ను కొట్టి..  ఇద్ద‌రు పిల్ల‌ల‌పై త‌ల‌దిండు పెట్టి.. కిరాత‌కంగా మారిన ఐటీ ఉద్యోగి..

సారాంశం

రెండేళ్లుగా ఉద్యోగం చేయకపోవడం, అప్పులు భారం పెరగడంతో ఓ ఐటీ ఉద్యోగి కిరాతకంగా మారాడు. భార్య, ఇద్దరు పిల్లలను హత్య  చేసి అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. 

అత‌డు ఓ ఐటీ ఉద్యోగి. మంచి జీతం. భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లతో సాఫీగా సాగిపోతున్న జీవితం. ఇదంతా రెండేళ్ల క్రితం. ఉన్నంట్టుండి ప‌రిస్థితులు మారిపోయాయి. రెండేళ్ల నుంచి అత‌డు ఉద్యోగానికి వెళ్ల‌డం లేదు. దీంతో కుటుంబ పోష‌ణ భారం అయ్యింది. దీంతో తెలిసిన వాళ్ల ద‌గ్గ‌ర అప్పులు చేశాడు. ప్రైవేటు కంపెనీల ద‌గ్గ‌ర లోన్స్ తీసుకున్నాడు. స్నేహితుల ద‌గ్గ‌ర నుంచి అప్పు పేరిట ల‌క్ష‌ల రూపాయిలు తీసుకున్నాడు. తీసుకున్న అప్పుల‌న్నీ ఖ‌ర్చ‌యిపోయాయి. దీంతో కుటుం పోష‌న భారం అయ్యింది. అప్పులు కూడా ఎక్కువ‌వ‌టంతో ఆందోళ‌న ఎక్కువైంది. ఏం చేయాలో తోచ‌ని మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌కు గురై కిరాతంగా ఆలోచించాడు. తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో పాటు భార్యా, పిల్ల‌ల‌ను కూడా చంపేయాల‌నుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా భార్య‌ను బాట్‌తో త‌ల‌పై గ‌ట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్క‌డిక్క‌డే చనిపోయింది. అలాగే త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను త‌ల‌దిండు వేసి గ‌ట్టిగా నొక్కిప‌ట్టి ఉంచాడు. ఊపిరి ఆడ‌క‌పోవ‌డంతో పిల్ల‌లు ఇద్ద‌రు చ‌నిపోయారు. త‌రువాత అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో జ‌రిగింది. 

దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కొత్త కేసులు.

త‌మిళ‌నాడులోని పెరుంగుడిలో మ‌ణిగండ‌న్ నివ‌సిస్తున్నాడు. అత‌డు  ఓ ఐటీ ఉద్యోగి. ఇద్ద‌రు పిల్ల‌లు, భార్యతో జీవితం సంతోషంగా గ‌డుపుతున్నాడు. జీతంగా కూడా  బాగానే వ‌స్తుండ‌టంతో ఎలాంటి లోటు లేదు. కానీ అత‌డు ఉద్యోగం మానేశాడు. రెండేళ్ల నుంచి ఇంట్టోనే ఖాళీగా ఉంటున్నాడు. దీంతో కుటుంబ పోష‌ణ భారంగా మారింది. దీంతో అప్పులు చేయాల్సి వ‌చ్చింది. తెలిసిన వాళ్ల అందరి ద‌గ్గ‌ర అప్పులు చేశాడు. ప‌లు ప్రైవేట్ కంపెనీల నుంచి అప్పులు కూడా తీసుకున్నాడు. తెలిసిన స్నేహితుల వ‌ద్ద నుంచి కూడా అప్పు చేశాడు. మ‌ళ్లీ ఉద్యోగంలో జాయిన్ కాక‌పోవ‌డంతో ఆ అప్పులు తీర్చ‌లేక‌పోయాడు. కొత్త అప్పులు కూడా పుట్టే ప‌రిస్థితి కనిపించ‌లేదు. దీంతో అత‌డు తీవ్ర మానసిక ఆందోళ‌న‌కు గుర‌య్యాడు.

వేడి వేడి సాంబార్ లో పడిన చిన్నారి మృతి.. మహాబూబాబాద్ లో దారుణం..

కుటుంబ పోష‌ణ కోసం ఏం చేయాల‌తో తెలిలేదు. అప్పుల ఒత్తిడికూడా మ‌ణిగండ‌న్‌కు ఎక్కువ‌య్యింది. తీవ్ర ఫ్ర‌ష్టేష‌న్‌కు గురైన అత‌డు కిరాత‌కంగా ఆలోచించాడు. ఈ  టెన్ష‌న్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలంటే తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని భావించాడు. అయితే తాను ఒక్క‌డే చ‌నిపోకుండా భార్య పిల్ల‌ల‌ను కూడా చంపేయాల‌ని ఉన్మాదిగా ఆలోచించాడు. దీంతో భార్య ప్రియ (36)ను అతి కిరాత‌కంగా బ్యాట్ త‌ల‌పై బాదాడు. దీంతో ఆమె త‌ల‌కు తీవ్ర ర‌క్త స్రావం జ‌రిగింది. త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. అనంత‌రం ఇద్ద‌రు చిన్నారులు ధరన్‌(10), దహన్‌(01)లను చంపేయాల‌ని అనుకున్నాడు. పిల్ల‌లిద్ద‌రినీ ప‌డుకోబెట్టి వారి త‌ల‌పై దిండు పెట్టి గ‌ట్టిగా ప్రెస్ చేశాడు. పిల్ల‌ల‌కు ఊపిరి ఆడ‌క‌పోవ‌డంతో మృతి చెందారు. అనంత‌రం అత‌డు ఆ ఇంట్లో ఉన్న వంట గ‌దికి వెళ్లారు. ఆ గదిలోనే ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. స్థానికులు అక్క‌డి చేరుకున్నారు. అనంత‌రం వారు పోలీసుల‌కు స‌మ‌చారం అందించారు. పోలీసులు అక్క‌డికి చేరుకున్నాడు. మృత దేహాల‌ను పోస్టుమార్టం కోసం స్థానికంగా ఉండే క్రోంపేట హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం