ఇద్దరు పురుషుల మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ప్రేమనే వారికి శాపంగా మారింది. ఒకరు చేసిన తప్పుకు మరొకరు ప్రాణాలు వదలాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ లో చోటుచేసున్న ఈ ఘటన వైరల్ గా మారింది.
ప్రేమకు హద్దులు.. ఎళ్లలు ఉండవు అని చాలా మంది రచయితలు తమ అద్బుతమైన రచనల్లో ప్రేమ గొప్పదనం గురించి వివరించారు. ప్రేమలో సుఖసంతోషాలతో పాటు బాధలు, విషాదాలు ఉంటాయని చరిత్రలో అనేక ఘటనలు నిరూపించాయి. ఇదే తరహాలో.. ఇద్దరు మంచి స్నేహితులు.. చాలా కాలం కిందట పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. కలిసి కొన్నాళ్లు జీవితం సాగించారు కూడా. అయితే, వారిద్దరు పురుషులు కావడంతో.. వీరి ప్రేమ పాలిట శాపంగా మారింది. ఒకరు చేసిన తప్పుకి మరొకరు ప్రాణాలు వదలాల్సివచ్చింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేకుంది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.
Also Read: coronavirus: దేశంలో భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు..
undefined
వివరాల్లోకి వెళితే.. ఇద్దరు పురుషులు స్నేహితుల మధ్య ఉన్న స్నేహ బంధం ప్రేమగా మారడంతో.. కొన్నాళ్లు కలిసి జీవించారు. అయితే, వారి ప్రేమకు లోకం అడ్డుపడటంతో ఒకరు చేసిన తప్పుకు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన హిమాన్షు శర్మ ఒక ప్రయివేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. సాఫీగా సాగుతున్న జీవితం. అయితే, కొంత కాలం క్రితం అతనికి పక్కగ్రామం బీజల్‌పూర్‌లో నివసించే అమన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఇద్దరి అభిరుచులు ఒకటే కావడం ఎక్కువ సమయం తోడుగా గడిపేవారు. అయితే, వారి మధ్య ఉన్న స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి కొంత కాలం సహజీవనం కూడా చేశారు. ఇద్దరి జీవితం మంచిగా ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో వారి ప్రేమకు లోకం అడ్డుపడింది. వీరి ఇద్దరి గురించి తెలిసిన కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Also Read: sex abuse case: సెక్స్ కుంభకోణంలో ట్రంప్, క్లింటన్.. మరోసారి తెరపైకి జెఫ్రీ ఎప్‌స్టీన్
హిమాన్షు శర్మ, అమన్ ల ప్రేమ వ్యవహారం.. ఇద్దరు సహజీవం చేస్తున్న విషయం గురించి చట్టుపక్కల వారికి తెలిసింది. అటునుంచి వారి కుటుంబ సభ్యులకు చేరింది. ఇద్దరి మధ్య సంబంధం గురించి అమన్ కుటుంబ సభ్యులకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు అమన్ సోదరులు, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు హిమాన్షు ఇంటికి వచ్చి అమన్ నుంచి ఇకనుంచి దూరంగా ఉండమని హెచ్చారించారు. అప్పటి నుంచి అమన్ కూడా హిమాన్షు వద్దకు రావడం మానేశాడు. వీరిద్దరు కలుసుకోవడం తగ్గిపోయింది. అయితే, ఇద్దరు కానీ అమన్‌ను వదిలి ఉండలేని హిమాన్షు ఒకసారి అమన్ కోసం అతని గ్రామనికి వెళ్లాడు. అయితే, అక్కడ హిమాన్షుని ఘోరంగా అవమానించారు. అమన్ కూడా ఇక మీద తన వద్దకు రావద్దని హిమాన్షుతో చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
వీరిద్దరి ప్రేమలోకి ఇరు కుటుంబాలు జోక్యంతో వీరు దూరమయ్యారు. హిమాన్షు శర్మ, అతని కుటుంబ సభ్యుల మాటలకు హిమాన్షు చాలా బాధపడ్డాడు. తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. హిమాన్షు భోజనం చేయడం మానేశాడు. టీచర్ ఉద్యోగానికి వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఒకరోజు అమన్ ఫోన్ చేసి తనకు ఒక అమ్మాయితో పెళ్లి జరగబోతోందని చెప్పాడు. ఇది విని హిమాన్షు తట్టుకోలేక పోయాడు. అమన్ లేని జీవితం వ్యర్థం అని భావించి ఉరి వేసుకొని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. హిమాన్షు శర్మ మరణం గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: Assembly Elections2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి .. లేకుంటే..?