
న్యూఢిల్లీ: పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ఉపవాసం చేస్తున్నారు. చంద్రయాన్ 3 బుధవారం సాయంత్రం అంటే మరికొన్ని రోజుల్లో ల్యాండింగ్ కానుంది. ఈ సందర్భంగానే చంద్రయాన్ 3 విజయవంతం కావాలని సీమా హైదర్ ఉపవాసం చేపట్టినట్టు ఓ వీడియోలో పేర్కొంది. ఈ వీడియోను సీమా హైదర్ లాయర్ ఏపీ సింగ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
‘నా హెల్త్ బాగోలేదు. కానీ, చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ఈ రోజు ఉపవాసం ఉంటున్నాను. ఈ రోజు చంద్రయాన్ చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఇది భారత విజయాల్లో కీలక మైలురాయి అవుతుంది. చంద్రయాన్ విజయవంతంగా జాబిల్లిపై దిగే వరకు నేను ఉపవాసం ఉంటాను. నేను ఎంతో విశ్వసించే రాధా క్రిష్ణ, శ్రీ రాముడికి పూజలు చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు కోసం మన ప్రధానమంత్రి ఎంతో కష్టపడ్డారు. ఈ చంద్రయాన్ విజయవంతంగా ల్యాండ్ అయితే భారత పేరు ప్రపంచంలో మార్మోగుతుంది. రాధే, రాదేధ, రాధే, క్రిష్ణ’ అని సీమా హైదర్ ఆ వీడియోలో మాట్లాడారు.
Also Read: చంద్రయాన్ 3 పై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ రియాక్షన్ ఇదే
ఆమె లాయర్ మాట్లాడుతూ.. చంద్రయాన్ 3 విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే చంద్రయాన్ విజయవంతంగా ల్యాండ్ అవుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.