Padma Awards 2022: గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్.. బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్

Siva Kodati |  
Published : Jan 25, 2022, 08:11 PM ISTUpdated : Jan 25, 2022, 09:46 PM IST
Padma Awards 2022: గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్.. బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్

సారాంశం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్, దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్‌ పురస్కారాలను  ప్రకటించింది. 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. వీరిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. దీనిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్, దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్‌ పురస్కారాలను  ప్రకటించింది. యూపీకి చెందిన దివంగత సాహిత్యవేత్త రాధేశ్యామ్ ఖేమ్మాకు పద్మ విభూషణ్, మహారాష్ట్రకు చెందిన కళాకారిణి ప్రభా ఆత్రేకు పద్మ విభూషణ్ ప్రకటించింది. అలాగే యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్‌కు పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లకు సైతం పద్మ భూషణ్ వరించింది.

అవార్డు పొందిన వారు వీరే:

పద్మ విభూషణ్

ప్రభా ఆత్రే - కళలు
రాధేశ్యామ్ ఖేమ్కా - సాహిత్యం (మరణానంతరం)
జనరల్ బిపిన్ రావత్ -  సివిల్ సర్వీసులు (మరణానంతరం)
కల్యాణ్ సింగ్ -  పబ్లిక్ అఫైర్స్ (మరణానంతరం)


పద్మ భూషణ్

గులాంనబీ ఆజాద్ - (పబ్లిక్ అఫైర్స్)
విక్టర్ బెనర్జీ - (కళలు)
గుర్మీత్ బావా - (కళలు) (మరణానంతరం)
బుద్ధదేవ్ భట్టాచార్య - (పబ్లిక్ అఫైర్స్)
నటరాజన్ చంద్రశేఖర్ -  (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ)
కృష్ణ ఎల్లా, సుమిత్రా ఎల్లా -  (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ)

 

పూర్తి జాబితా కోసం చూడండి:

 

 

 

 

 

 

 

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !