Shaurya Chakra 2022 awardees: ఈ ఏడాది శౌర్య పురస్కారం పొందిన సైనికులు వీరే..

By Rajesh KFirst Published Jan 25, 2022, 7:18 PM IST
Highlights

Shaurya Chakra 2022 awardees:  గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత సైన్యంలోని ఆరుగురు సిబ్బందికి శౌర్యచక్రతో స‌త్క‌రించ‌నున్న‌ది. వారి  విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురాస్కారాన్ని అందించ‌నున్నారు. ఇందులో ఐదుగురు భారత ఆర్మీ సిబ్బందికి మరణానంతరం శౌర్యచక్రఅవార్డును అందించ‌నున్న‌ట్టు  రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. శౌర్య చక్ర.. దేశంలోనే మూడ‌వ‌ అత్యున్న‌త శాంతి పురస్కారం.
 

Shaurya Chakra 2022 awardees:  గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత సైన్యంలోని ఆరుగురు సిబ్బందికి శౌర్యచక్రతో స‌త్క‌రించ‌నున్న‌ది. వారి  విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురాస్కారాన్ని అందించ‌నున్నారు. ఇందులో ఐదుగురు భారత ఆర్మీ సిబ్బందికి మరణానంతరం శౌర్యచక్రఅవార్డును అందించ‌నున్న‌ట్టు  రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. శౌర్య చక్ర.. దేశంలోనే మూడ‌వ‌ అత్యున్న‌త శాంతి పురస్కారం.


శౌర్య పురస్కారం పొందిన సైనికుల జాబితా (Shaurya Chakra 2022 awardees)

1. శ్రీజిత్ ఎం (Sreejith M, Sena Medal)

శ్రీజిత్..  మద్రాస్ రెజిమెంట్‌లోని 17వ బెటాలియన్‌తో నాయబ్ సుబేదార్‌గా దేశానికి సేవలందించారు.
17 జూలై 2021లో జమ్మూ కాశ్మీర్‌లో సెర్చ్ ఆపరేషన్‌లో  వీరమరణం పొందాడు.

అనిల్ కుమార్ తోమర్ (Anil Kumar Tomar)

హవల్దార్ అనిల్ కుమార్ తోమర్.. ఆయ‌న‌ రాజ్‌పుత్ రెజిమెంట్/44 రాష్ట్రీయ రైఫిల్స్ లో హ‌వ‌ల్దార్ గా సేవ‌లందించారు. డిసెంబర్ 2020లో కాశ్మీర్‌లో ఉగ్రవాదుల మ‌ధ్య జ‌రిగిన హోరాహోరీలో ఆయ‌న ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చి.. వీర మ‌ర‌ణం పొందాడు.  

కాశీరాయ్ బమ్మనల్లి (Kashiray Bammanalli) 

కాశీరాయ్ బమ్మనల్లి.. ఆయ‌న రాష్ట్రీయ రైఫిల్స్ యొక్క కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్/44వ బెటాలియన్‌లో సేవలందించారు.  జూలై 1, 2021న పుల్వామాలో జ‌రిగిన ఓ సిక్రెట్ ఆపరేషన్‌లో పాల్గొని తన ప్రాణాలను అర్పించాడు
 
పింకు కుమార్ (Pinku Kumar) 

పింకు కుమార్.. రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జాట్ రెజిమెంట్/34వ బెటాలియన్ లో హవల్దార్ గా పని చేశారు. ఆయ‌న మార్చి 27, 2021న కాశ్మీర్‌లోయ లో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డి.. 
 వీరమరణం పొందారు. 

మరుప్రోలు జస్వంత్ కుమార్ రెడ్డి (Maruprolu Jaswanth Kumar Reddy)

మారుప్రోలు జస్వంత్ కుమార్ రెడ్డి ..మద్రాస్ రెజిమెంట్‌లోని 17వ బెటాలియన్‌లో ప‌నిచేశారు. ఆయ‌న‌ 2021 జూలై 8న భార‌త  భూభాగంలో ఉగ్రవాదుల చొర‌బడ్డార‌ని సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఆయ‌న‌ ప్రాణాలను అర్పించారు.

రాకేష్ శర్మ (Rakesh Sharma)

రాకేష్ శర్మ.. అస్సాం రైఫిల్స్ లో రైఫిల్‌మ్యాన్ సేవలందిస్తున్నారు. మే 2021లో అస్సాంలోని ఒక గ్రామంలో జరిగిన ఉగ్ర‌ దాడిలో అసాధారణమైన వ్యూహాత్మక చతురత, నిస్వార్థత, స్ఫూర్తిదాయకమైన నాయకత్వం, ధైర్యాన్ని ప్రదర్శించినందుకు  రైఫిల్‌మ్యాన్ రాకేష్ శర్మ శౌర చక్రకు నామినేట్ చేయబడ్డాడు.


ప్ర‌తి యేటా.. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల సందర్భంగా దేశ భద్రతలో అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించిన వీర జవాన్లకు శౌర్య పురస్కారాలు అందజేస్తారు .  తాజాగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం  గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది.
 
రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం సాయంత్రం రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ 384 మంది డిఫెన్స్ ప‌ర్స‌న‌ల్‌కు గ్యాలంట్రీ అవార్డులు మరియు ఇతర అవార్డులను ప్ర‌దానం చేయ‌నున్నారు. అందులో 12 శౌర్య చ‌క్ర అవార్డులు, 29 ప‌ర‌మ్ విశిష్ఠ్ సేవా మెడ‌ల్స్‌, 4 ఉత్త‌మ్ యుధ్ సేవా మెడ‌ల్స్‌, 53 అతి విశిష్ఠ్ సేవా మెడల్స్‌, 1. 3 యుధ్ సేవా మెడ‌ల్స్‌, 3 విశిష్ఠ్ సేవా మెడ‌ల్స్ ఉన్నాయి.వీటితో పాటు మరో 122 విశిష్ట సేవా పతకాలు, 81 సేన పతకాలు, రెండు వాయు సేన పతకాలు, 40 సేన పతకాలు, ఎనిమిది నేవీసేన పతకాలు, 14 నావో సేన పతకాలతో విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారు

click me!