మహారాష్ట్రలో లక్షకు పైగా లవ్ జిహాద్ కేసులు.. శ్రద్ధా తరహా హత్యలను అనుమతించబోం - మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా

Published : Mar 09, 2023, 12:30 PM IST
మహారాష్ట్రలో లక్షకు పైగా లవ్ జిహాద్ కేసులు.. శ్రద్ధా తరహా హత్యలను అనుమతించబోం -  మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా

సారాంశం

మహారాష్ట్రలో శ్రద్దా వాకర్ హత్య తరహా కేసులను నివారించేందుకు ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ రాష్ట్ర మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా అన్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా లవ్ జిహాద్ కేసులు నమోదు అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

మహారాష్ట్రలో లక్షకు పైగా లవ్ జిహాద్ కేసులు నమోదు అయ్యాయని ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా అన్నారు. రాష్ట్రంలో శ్రద్దా వాకర్ హత్య వంటి కేసులను ఆపాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అలాంటి హత్యలను అనుమతించబోమని తెలిపారు. వీటి నివారించడానికి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మతాంతర వివాహ కమిటీని లోధా సమర్థించారు. 

దేశాన్ని విడగొట్టడానికి రాహుల్ గాంధీ ప్రజలను రెచ్చగొడుతున్నారు.. : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మహారాష్ట్ర కొత్త మహిళా విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీలో మహిళా విధానంపై చర్చ జరిగింది. శాసనసభలో ఈ అంశంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ లోధా ఈ ప్రకటన చేశారు.

మహిళల సంక్షేమం, భద్రత, సాధికారతకు సంబంధించి ఎమ్మెల్యేలు చేసిన సూచనలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు సంబంధించిన నిర్ణయాలపై ప్రభుత్వం తన పనితీరు నివేదికను క్రమం తప్పకుండా ప్రవేశపెడుతుందని తెలిపారు. కొత్త విధానం ఆచరణాత్మకంగా ఉంటుందని, మహిళల కోసం 'టూరిస్ట్ పాలసీ'ని కూడా ప్రకటిస్తామని చెప్పారు. 

కాళ్లకు కెమెరా, మైక్రో చిప్.. ఒడిశా తీరంలో పట్టుబడ్డ గూఢచర్య పావురం..!!

ప్రతీ నెలా జిల్లా స్థాయిలో మహిళల కోసం ‘జనతా దర్బార్’ నిర్వహిస్తామని, ఇందులో 50 ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రతీ నెలా అన్ని జిల్లాల్లో మహిళా బజార్ ను ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల్లో 50 శాతాన్ని మహిళల సంక్షేమానికి కేటాయించాలన్నారు. కాగా.. అసెంబ్లీలో తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?