Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా

Published : Feb 03, 2025, 11:53 PM ISTUpdated : Feb 04, 2025, 12:24 AM IST
Ayodhya Ram Mandir :  అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా

సారాంశం

వసంత పంచమి సందర్భంగా ఇవాళ అయోధ్య రామాలయం భక్తులతో కిటకిిటలాడింది. ఇలాఈ కుంభమేళా ప్రారంభంనుండి ఇప్పటివరకు అయోధ్య ఆలయాన్ని ఎంతమంది భక్తులు సందర్శించారో తెలుసా? 

Kumbhmela 2025 : ప్రయాగరాజ్ కుంభమేళా వేళ అయోధ్య రామనగరి కొత్త రికార్డు సృష్టించింది. జనవరి 26 నుంచి వసంత్ పంచమి అంటే ఫిబ్రవరి 3 వరకు అయోధ్యకు కోటి మందికి పైగా భక్తులు వచ్చారు. ఇవాళ లక్షలాదిమంది భక్తుల రామనామస్మరణతో అయోధ్య మారుమోగింది. 

పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ అయోధ్యలో కొలువైన బాలరాముడిని భక్తుడు దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాట్లను చూసి మైమరచిపోయిన భక్తులు సంతోషంగా శ్రీరాముడితో పాటు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగికి మద్దతుగా నినాదాలు చేసారు. సోమవారం వసంత్ పంచమి రోజున లక్షలాది మంది భక్తులు కుంభమేళాలో స్నానంచేసి నేరుగా అయోధ్యకు వచ్చారు.... ఇక్కడ రామయ్యను దర్శించుకుని పూజలు చేశారు.

భవ్యమైన ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత మొదటిసారిగా ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులు అయోధ్యకు కూడా వస్తారని ముందే అంచనా వేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రభుత్వ అధికారులను నియమించారు. ఏ భక్తుడికీ ఇబ్బంది కలగకూడదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఎలాంటి అలసత్వం లేకుడా భక్తులకు మెరుగైన సేవలు అందేలా చూస్తున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu