Prayagraj Kumbhmela 2025 : మహా కుంభమేళా 2025 లో పవిత్ర త్రివేణి సంగమప్రాంతంలో హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది.
Maha Kumbhmela 2025 : ప్రయాగరాజ్మహాకుంభమేళాలో త్రివేణి సంగమప్రాంతంలో సంకటహర హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. వేద మంత్రాలతో పాటు శంఖ, ఘంటా నాదాల మధ్య ఈ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన ఆచార్యులు స్వామి చిదానంద సరస్వతి మాట్లాడుతూ...మహా కుంభమేళాలో హనుమంతుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈ ప్రాంతానికే నూతన ఉత్సాహాన్నిస్తుంది" అని అన్నారు.