లోక్ సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ఏకమవుతాయి - కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

Published : Feb 26, 2023, 02:20 PM IST
లోక్ సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ఏకమవుతాయి - కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

సారాంశం

ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడారు. లోక్ సభ ఎన్నికలకు ముందు విపక్షాలు అన్నీ ఏకం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. 

లోక్ సభ ఎన్నికలకు ముందు విపక్షాలు ఏకం అవుతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అయితే ఈ విషయంలో ఎక్కువ ఆశలు కాంగ్రెస్ పైనే ఉన్నాయని తెలిపారు. రాయ్ పూర్ లో జరుగుతున్న 85వ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. కిసాన్ సెల్ అధ్యక్షునిగా మాణిక్‌ కదమ్‌..

‘‘ఇప్పుడు మనకు ఏడాది మాత్రమే మిగిలి ఉంది. మనం (ప్రతిపక్షాలు) ఐక్యమవుతామని అంచనాలు ఉన్నాయి. అన్ని ప్రతిపక్ష పార్టీలు, వారిని (బీజేపీ) వ్యతిరేకించే ప్రజలు ఐక్యంగా పోరాడాలి. అందరి నుంచి అంచనాలు ఉన్నాయి కానీ ఎక్కువ ఆశలు కాంగ్రెస్ పైనే ఉన్నాయి’’ అని కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. బీజేపీని ఎదుర్కొనే ధైర్యం మీకు ఉందని తనకు తెలుసని అన్నారు. దేశం కోసం ఆ ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మండల స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్  జోడో యాత్రకు  ప్రజల నుండి  మంచి మద్దతు లభించిందని తెలిపారు.

వ్యభిచార గృహంపై 10 మంది సాయుధుల దాడి.. గన్‌లతో లోనికి వెళ్లి విలువైన వస్తువులతో పరార్.. ఒకరి హత్య 

 భారత్ జోడో యాత్రలో  ప్రజలు, రైతుల కష్టాలను చాలా దగ్గరుండి  చూసినట్టుగా  చెప్పారు. ఈ యాత్రలో  తనకు  ప్రజల నుండి ఊహించని మద్దతు లభించిందన్నారు. యాత్ర మొదలు పెట్టాక తనలో  అనేక  మార్పులు  వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో  చోటు  చేసుకున్న ఘటనలను రాహుల్ గాంధీ గుర్తు  చేసుకున్నారు.

పాలిటిక్స్ నుంచి సోనియా గాంధీ రిటైర్ అయ్యారా? ఆ కన్ఫ్యూజన్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన కాంగ్రెస్

ఎండ, వాన, చలిలో  కూడా  ప్రజలు తనతో కలిసి పాదయాత్రలో  పాల్గొన్నారని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. భారత్ జోడో  యాత్రలో భాగంగా  నాలుగు నెలలు ప్రజల మధ్యే ఉన్నానని  ఆయన తెలిపారు. ఈ యాత్రలో  లక్షల మంది ప్రజలు తనలో కలిసి నడిచారని చెప్పారు. తన ఆరోగ్యంపై తనకు అపరిమితమైన విశ్వాసం ఉండేదని తెలిపారు. కానీ భారత్ జోడో యాత్రలో  ఆరోగ్యం  దెబ్బతిందన్నారు. కానీ  తనకు  భారతమాత నుండి వచ్చిన సందేశాలు శక్తిని నింపాయని అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !