కొత్త తీర్మానాలు కాగితాలపై మాత్రమే కాదు.. క్షేత్ర‌స్థాయిలో అమలవ్వాలి: కాంగ్రెస్ 85వ ప్లీన‌రిలో ప్రియాంక గాంధీ

Published : Feb 26, 2023, 02:15 PM IST
కొత్త తీర్మానాలు కాగితాలపై మాత్రమే కాదు.. క్షేత్ర‌స్థాయిలో అమలవ్వాలి:  కాంగ్రెస్ 85వ ప్లీన‌రిలో ప్రియాంక గాంధీ

సారాంశం

Raipur: కాంగ్రెస్ పార్టీ కొత్త తీర్మానాలను తీసుకురావడం మంచిదేనని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని పేర్కొన్నారు. కొత్త తీర్మానాలు కాగితాల మీద‌కే పరిమితం కాకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.  

Congress 85th Plenary: రాయ్ పూర్ లో జరిగిన 85వ ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ త‌మ‌ పార్టీ రాజ్యాంగానికి పలు సవరణలను ఆమోదించింది. కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, భూపేష్ బాఘేల్, కేసీ వేణుగోపాల్, పవన్ బన్సాల్ స‌హా ఆ పార్టీకి చెందిన అంద‌రూ నాయ‌కులు పాలుపంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త తీర్మానాలను తీసుకురావడం మంచిదేనని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని పేర్కొన్నారు. కొత్త తీర్మానాలు కాగితాల మీద‌కే పరిమితం కాకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

రాయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కొత్త తీర్మానాలను తీసుకురావడం మంచిదేనని, అయితే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ప్రియాంక గాంధీ అన్నారు. తమ సంస్థను మండల, బ్లాక్ స్థాయి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నామనీ, అయితే ఇది కాగితాల్లో మాత్రమే ఉండకూడదని, కాంగ్రెస్ పార్టీ సామాన్యుల గురించి ఏమనుకుంటున్నదో నాయకులు ప్రజల్లోకి వెళ్లి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి తమ కార్యక్రమాల గురించి వివ‌రించాల‌నీ, అప్పుడే పార్టీ వారి కోసం ఏం చేస్తుందో ప్రజలకు తెలుస్తుందన్నారు.

కాగ్రెస్ పార్టీ సందేశాన్ని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రియాంక పిలుపునిచ్చారు. పార్టీ కోసం పోరాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల పోరాటాలను ఆమె కొనియాడారు. "బీజేపీని ఎదుర్కొనే ధైర్యం మీకు ఉందని మాకు తెలుసు, దేశం కోసం ఆ ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని" అన్నారు. భారతీయ జనతా పార్టీని ఓడించడానికి భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ నొక్కి చెప్పిన మరుసటి రోజే ప్రియాంక ఈ సందేశం ఇచ్చారు.

ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతల వెనుక ప‌డేందుకు కేంద్రం జాతీయ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్న‌ద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ ప్లీనరీని అడ్డుకోవ‌డానికి ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ నాయ‌కుల పై ఈడీ దాడులు చేస్తోందని విమ‌ర్శించారు. అంతకుముందు,  "బీజేపీ పేదల వ్యతిరేకి.. ఢిల్లీలో అధికారంలో ఉన్న వారి డీఎన్ఏ పేదలకు వ్యతిరేకం, వారు తమపై దాడి చేస్తున్నారని" కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున‌  ఖర్గే విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందించగల ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని సోనియా గాంధీ ఆరోపించారు.

కాగా, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలకు పార్టీలో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మహిళలు మరియు మైనారిటీలకు రాష్ట్ర స్థాయి (పిసిసి), జాతీయ స్థాయి (ఎఐసిసి) ప్రతినిధులతో సహా అన్ని పార్టీ పదవులలో 50 శాతం రిజర్వేషన్లు ఉండేలా కాంగ్రెస్ పార్టీ శనివారం పార్టీ రాజ్యాంగాన్ని సవరించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం