మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి.
మణిపూర్ హింసాకాండకు సంబంధించిన తమ డిమాండ్లపై పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో లోక్ సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి ఇండియా యోచిస్తోంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే ప్రతిపాదనపై విపక్షాలు చర్చించినట్లు సమాచారం.
మాజీ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసు.. నిర్దోషిగా తేలిన హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ పరిస్థితిపై పార్లమెంటులో మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోడీని ఒత్తిడి చేసేందుకు ఉన్న పలు అవకాశాలు ప్రతిపక్షాలు పరిశీలించాయి.ఈ నేపథ్యంలో మణిపూర్ పై చర్చను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని బలవంతం చేయడానికి ఇది సమర్థవంతమైన మార్గం అని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మణిపూర్ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాల వ్యూహం రాజ్యసభలోనూ కొనసాగుతుందని ఆ వర్గాలు తెలిపాయి.
యువతిపై ఆరేళ్ల బాలుడు, చనిపోయిన మహిళ అత్యాచారం - యూపీలో వింత ఘటన.. ఇంతకీ ఏం జరిగిందంటే ?
మణిపూర్ హింసాకాండపై ప్రధాని ప్రకటన చేయాలనే డిమాండ్ ను ఉధృతం చేసేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా నేతలు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లో సమావేశమై తమ వ్యూహాన్ని రూపొందించుకున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్ లో సమావేశమైన నేతలు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.
In today's meeting, I.N.D.I.A parties discuss proposal to move no-confidence motion against govt: Sources https://t.co/EC22lOdE7r
— ANI (@ANI)కాగా.. మణిపూర్ లో జాతి హింసపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలనే డిమాండ్ కు బిజెపి శాసనసభ్యులు పట్టుబట్టడంతో ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి మూడు రోజులు రద్దయ్యాయి. ఇదిలా ఉండగా.. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు చివరిసారిగా 2003లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. తీర్మానంపై చర్చించి ఓటింగ్ జరిగింది. అయితే ఆ తీర్మానం గట్టెక్కలేదు. దీంతో వాజ్ పేయ్ ప్రధానిగా కొనసాగారు.
మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని ఇంటికొచ్చి.. తాత, అమ్మమ్మల దారుణ హత్య..
లోక్ సభలోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. స్పీకర్ కు అవిశ్వాస నోటీసు ఇవ్వాలంటే ప్రతిపక్షాలకు దిగువ సభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. లేదంటే లోక్ సభ నిబంధనల ప్రకారం నోటీసు తిరస్కరణకు గురవుతుంది. ఈ తీర్మానంపై నిర్ణయం తీసుకోవడానికి తప్పనిసరి అయిన ఓటింగ్ లో ప్రభుత్వం ఓడిపోతే ప్రధాని రాజీనామా చేయాలి. అయితే ప్రస్తుతం పార్లమెంటు దిగువ సభలో సౌకర్యవంతమైన మెజారిటీ ఉన్నందున నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ తీర్మానం నుంచి ఎలాంటి ముప్పూ లేదు.