ఇవి చిల్లర రాజకీయాలు కాక మరేంటి? ..జైరాం రమేష్‌ ఆగ్రహం!

Published : May 19, 2025, 04:50 AM IST
ఇవి చిల్లర రాజకీయాలు కాక మరేంటి? ..జైరాం రమేష్‌ ఆగ్రహం!

సారాంశం

ఆపరేషన్ సింధూర్ అంతర్జాతీయ ప్రచార బృందంలో కాంగ్రెస్ సూచించిన ఎంపీలను పక్కనబెట్టడంపై జైరాం రమేష్ కేంద్రంపై 'చిల్లర రాజకీయాలు', 'రాజకీయం' అంటూ మండిపడ్డారు.

ఆపరేషన్ సింధూర్ చుట్టూ రాజకీయ దుమారం రాజుకుంది. ఈ మిలిటరీ ఆపరేషన్‌ను అంతర్జాతీయంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటైన బృందంలో కాంగ్రెస్ సూచించిన నలుగురు ఎంపీలలో కేవలం ఒకరినే ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.జైరాం రమేష్ తెలిపిన సమాచారం ప్రకారం, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు – కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను నాలుగు పేర్లను పంపాలని కోరారు. దానికి స్పందనగా కాంగ్రెస్‌ ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, నాసిర్ హుస్సేన్, రాజా బరార్‌లను సూచించింది. అయితే చివరికి కేంద్రం లిస్టులో లేని శశిథరూర్ కి  ఆ అవకాశం ఇచ్చింది. ఈ విషయంలో తాము పంపిన ఎంపీలు అర్హులేనన్నట్టుగా కేంద్రం వ్యవహరించిందని, ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేశారని కాంగ్రెస్ విమర్శించింది.

ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకున్నట్టు చూపించేందుకే ఈ ప్రక్రియ మొత్తమని, జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వ్యవహరించడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయం.అలాగే మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్‌ను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. పాక్‌ మీద తీసుకున్న సైనిక చర్యను అంతర్జాతీయంగా చర్చగా మార్చే ప్రయత్నంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై భారత ప్రధాని లేదా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎందుకు స్పందించలేదో కాంగ్రెస్ ప్రశ్నించింది.

ఇక మధ్యప్రదేశ్ మంత్రుల వ్యాఖ్యలతో కల్నల్ సోఫియా ఖురేషీపై వస్తున్న విమర్శలు కూడా అనుచితమని కాంగ్రెస్ అభిప్రాయపడింది. దేశ భద్రత వంటి కీలక అంశాలను రాజకీయానికి దూరంగా ఉంచాలన్నది పార్టీ స్థిరమైన నమ్మకం అని జైరాం రమేష్ తెలిపారు.అంతేకాదు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమే అసలు సమస్యనని, కశ్మీర్ కాదు అని ఆయన తేల్చేశారు. ప్రజల ముందే కాదు, పార్లమెంట్‌లోనే ఈ అంశాన్ని చర్చిస్తామని చెప్పారు.

కేంద్రం మాత్రం ఈ ఎంపికలపై సరైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది.మార్చి 22న కాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిన తరువాత భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. ఈ దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులను భారత్ చిత్తు చేసింది. అనంతరం పాక్ వైపు నుంచి కాల్పులు, డ్రోన్ దాడులు జరిగిన నేపథ్యంలో భారత్ ఒకేసారి పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై లక్ష్యంగా దాడి చేసి కీలక విజయాన్ని సాధించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vande Mataram: వందేమాతరాన్ని అవమానిస్తే జైలు శిక్ష‌.. ఇక‌పై జాతీయ గీతంతో స‌మాన హోద
ఉత్తరాఖండ్ లో వరదలకి కొట్టుకుపోయిన బ్రిడ్జ్ | Uttarakhand Flood Bridge Washed Away Viral Video