UP Elections 2022: మంత్రిగా రాజీనామా చేసి ప్రస్తుత మంత్రిపై పోటీ చేస్తున్న ఓపీ రాజ్‌భర్.. శివపూర్‌ చరిత్ర ఇదే

By Mahesh KFirst Published Jan 25, 2022, 6:31 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో వారణాసి పరిధిలోని శివపూర్ నియోజకవర్గ చరిత్ర ఆసక్తికరంగా ఉన్నది. ఈ సీటు 2012లో ఉనికిలోకి వచ్చింది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుత మంత్రి అనిల్ రాజ్‌భర్ ఉన్నారు. కాగా, ఈ సీటు నుంచే ఎపీ రాజ్‌భర్ బరిలోకి దిగబోతున్నట్టు తెలిసింది. ఓపీ రాజ్‌భర్ బీజేపీతో కూటమిగా ఏర్పడి గెలిచి మంత్రిగా చేశారు. ఆ తర్వాత మంత్రిగా రాజీనామా చేసి కూటమిని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
 

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(Uttar Pradesh Assembly Elections) సమీపిస్తున్నాయి. పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఒక్కో స్థానం చరిత్రను ఆచితూచి పరిశీలించిన తర్వాత సరైన అభ్యర్థిని ఎంచుకుని పార్టీలు రంగంలోకి దింపుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో వారణాసి(Varanasi)కి ప్రత్యేక చరిత్ర ఉన్నది. ఈ వారణాసికి సమీపంలోని శివపూర్(Shivpur) సీటు నుంచి యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) క్యాబినెట్ మంత్రి అనిల్ రాజ్‌భర్(Minister Anil Rajbhar) బరిలోకి దిగుతున్నారు. మంత్రి అనిల్ రాజ్‌భర్‌పై పోటీకి సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ Om Prakash Rajbhar రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే శివపూర్ సీటు చరిత్ర తెలుసుకుందాం.

వారణాసిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో కీలకమైంది శివపూర్ స్థానం. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి అనిల్ రాజ్‌భర్ ఉన్నారు. ఆయనపై పోటీకి సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్ దిగుతున్నట్టు వార్తలు రావడంతో శివపూర్ స్థానంపై చర్చ మొదలైంది.

2012లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత శివపూర్ స్థానం ఏర్పడింది. ఈ స్థానం నుంచి బీఎస్పీ టికెట్‌పై ఉదయలాల్ మౌర్య తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండో సారి 2017లో జరిగిన ఎన్నికల్లో అనిల్ రాజ్‌భర్ గెలిచారు. 2017లో బీఎస్పీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయలాల్ మౌర్యను కాదని వీరేంద్ర సింగ్‌కు టికెట్ ఇచ్చింది. దీన్ని బీజేపీ అనుకూలంగా ఉపయోగించుకుంది. అనిల్ రాజ్‌భర్ గెలువగా.. రెండు, మూడు స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులు నిలిచారు. ఓపీ రాజ్‌భర్‌కు చెక్ పెట్టడానికి అనిల్ రాజ్‌భర్‌ను మంత్రిగానూ బీజేపీ చేసింది. అనిల్ రాజ్‌భర్‌కు శివపూర్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్నది. 

అనిల్ రాజ్‌భర్ నవి ముంబయిలో జన్మించారు. వెనుకబడిన తరగతలు సంక్షేమ, దివ్యాంగుల సాధికారిత శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, రాజ్‌భర్ 1981లో కాన్శీరాం కాలంలో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, మాయావతితో విభేదాలు వచ్చి బీఎస్పీ వదిలి అప్నా దళ్‌లో కొనసాగారు. ఆ తర్వాత ఆయన 2002లో సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీని స్థాపించారు. బీజేపీతో కూటమి కట్టి 2017లో తొలిసారి ఆయన గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా సేవలు అందించారు. కానీ, ఆయన బీజేపీతోనూ ఎక్కువ కాలం కొనసాగలేదు. 2019లో మంత్రి పదవికి రాజీనామా చేసి కూటమిని రద్దు చేసుకున్నారు. తొలుత ఆయన ముఖ్తార్ అన్సారీపై పోటీకి దిగనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత ఆ నిర్ణయం ఉపసంహరించుకుని యోగి మంత్రిపై పోటీకి దిగబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన అఖిలేశ్ యాదవ్‌తో వేదిక పంచుకుంటున్నారు.

ఈ రాష్ట్రంలో గట్టి పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీకి మధ్యే కొనసాగుతున్నది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస పార్టీ.. ప్రియాంక గాంధీ సారథ్యంలో ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.తాజాగా, కాంగ్రెస్‌(Congress)కు పెద్ద దెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్(RPN Singh) పార్టీకి రాజీనామా(Resignation) చేశారు.అనంతరం ఆయన బీజేపీలో చేరారు.

click me!