Republic Day 2022: నేడు 73వ గణతంత్ర దినోత్సవం.. ఈ స్పెషల్ విషెస్, సూక్తులు మీ కోసం

By Sumanth KanukulaFirst Published Jan 25, 2022, 5:50 PM IST
Highlights

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మనదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ భారత్‌లో రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. దీంతో భారతదేశం ప్రజాస్వామ్య, సార్వభౌమ, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. నేడు (జనవరి 26) భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మనదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ భారత్‌లో రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. దీంతో భారతదేశం ప్రజాస్వామ్య, సార్వభౌమ, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. నేడు (జనవరి 26) భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతదేశాన్ని సార్వభౌమ, స్వతంత్ర దేశంగా నడిపించిన చారిత్రాత్మక త్యాగాలను ప్రజలు స్మరించుకుంటున్నారు. ఈరోజు జాతీయ సెలవు దినంగా ఉంటుంది.

జనవరి 26నే రిపబ్లిక్ డే ఎందుకు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. ఈ కమిటీ రూపొందించిన రాజ్యాంగాన్ని (Constitution) 1949 నవంబరు 26న అమోదించగా.. దాన్ని 1950 జనవరి 26 నుంచి అమలు చేశారు. 1930లో ఇదే రోజున  భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు. 

ఈ ఏడాది భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకునే.. విషెస్, మన నాయకులు చెప్పిన సూక్తులు ఇప్పుడు చూద్దాం..

-ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలతో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. కాబట్టి దానిని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

- నాకు రక్తం ఇవ్వండి మరియు నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను.

- గణతంత్ర దినోత్సవం రోజున ఎగిరే తిరంగ జెండా.. మన స్వేచ్ఛను సూచిస్తుంది.

- ఈ గొప్ప దేశంలో పుట్టిన వారు నిజంగా ధన్యులు.. ప్రతి ఒక్కరు భారతీయుడని గర్వపడాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2022!

- మన వారసత్వాన్ని, మన జాతీయ భావాలను సుసంపన్నం చేయడానికి, పరిరక్షించడానికి మనం చేయగలిగినదంతా చేస్తామని మన మాతృభూమికి ఈరోజు వాగ్దానం చేద్దాం. మీ అందరికీ 2022 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

-మన జీవితంలోని ప్రతి రోజు దేశభక్తిని నింపండి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

-మన దేశ వారసత్వాన్ని గుర్తుంచుకుని, అందులో భాగమైనందుకు గర్విద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

-మన వారసత్వాన్ని, ధర్మాన్ని, సంపదలను కాపాడుకుంటామని వాగ్దానం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

-కొందరికి ఆదివారం ఇష్టం.. కొందరికి సోమవారం ఇష్టం.. నాకు మాత్రం ఒక్కరోజు అంటే చాలా ఇష్టం. అదే గణతంత్ర దినోత్సవం. మీ అందరికీ 2022 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

-మీ స్వేచ్ఛను ఆస్వాదించండి.. అదే సమయంలో మన నాయకులు చేసిన అనేక త్యాగాలను కూడా గౌరవించండి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! ఈ రోజు మనం ఎక్కడ ఉన్నా.. భారతదేశం మనకు నిజమైన గుర్తింపు.

-భారతదేశం గొప్ప దేశం. శాంతియుత దేశం. భారతీయతను చాటి చెబుదాం. ప్రపంచానికి దిశానిర్దేశం చేద్దాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

సూక్తులు-
-“స్వేచ్చ అనేది ఎన్నటికీ విలువ కట్టలేనిది. అది మనిషి జీవితం యొక్క ఊపిరి. ఏం చెల్లిస్తే మనిషి స్వేచ్చగా జీవిస్తాడు" - మహత్మా గాంధీ

-“ప్రజల అభీష్టాన్ని వ్యక్తీకరించినంత కాలం మాత్రమే చట్టం యొక్క పవిత్రత నిర్వహించబడుతుంది." - భగత్ సింగ్
 
-“నేను దేశ సేవలో చనిపోయినా, నేను గర్వపడతాను. నా ప్రతి రక్తపు చుక్క... ఈ దేశం యొక్క ఎదుగుదలకు, దేశాన్ని శక్తివంతంగా, చైతన్యవంతంగా మార్చడానికి దోహదపడుతుంది"- ఇందిరా గాంధీ

-“దేశం అభివృద్ది చెందడమంటే.. అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ది- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్

-“నువ్వు నాకు నీ రక్తాన్ని  ఇవ్వు, నేను కు నీకు స్వాతంత్య్రం  ఇస్తా"- సుభాష్ చంద్ర బోస్

- “ప్రతి భారతీయుడు ఇప్పుడు తాను రాజ్‌పుత్, సిక్కు లేదా జాట్ అనే విషయాన్ని మర్చిపోవాలి. అతను భారతీయుడని గుర్తుంచుకోవాలి. - సర్దార్ పటేల్

-“విశ్వాసం అనేది తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడు కాంతిని అనుభవించే పక్షి" - రవీంద్రనాథ్ ఠాగూర్

- “ఒక ఆలోచన తీసుకోండి, దానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి, సహనంతో పోరాడండి. సూర్యుడు మీ కోసం ఉదయిస్తాడు." - స్వామి వివేకానంద

-“స్వరాజ్యం నా జన్మహక్కు.. నేను దానిని తప్పక పొందుతాను" – బాలగంగాధర తిలక్

-“మనందరం కలిసి దక్షిణాసియాలో శాంతి, సామరస్యం, పురోగతి యొక్క ప్రయాణాన్ని ప్రారంభిద్దాం." - అటల్ బిహారీ వాజ్‌పేయి

click me!