ఆన్ లైన్ లోన్ యాప్స్ కంపెనీ డైరెక్టర్లు.. చైనా పారిపోయారా?

By telugu news teamFirst Published Jan 19, 2021, 11:16 AM IST
Highlights

చైనాకు పారిపోయిన డైరెక్టర్ల కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు.. కేంద్ర ప్రభుత్వ సహాయంతో వారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఆన్ లైన్ లోన్  యాప్స్ ఎంత కలకలం రేపాయో అందరికీ తెలిసిందే. ఆన్ లైన్ లో అప్పులు ఇచ్చి.. మళ్లీ ఆ డబ్బుల కోసం విపరీతంగా వేధించారు. ఈ క్రమంలో కొందరు ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్న సంగతి  మనకు తెలిసిందే.  కాగా.. ఆ ఆన్ లైన్ లోన్ యాప్స్ కంపెనీల డైరెక్టర్లు చైనాకు పారిపోయారు.

వారిని తిరిగి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చైనాకు పారిపోయిన డైరెక్టర్ల కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు.. కేంద్ర ప్రభుత్వ సహాయంతో వారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చైనా కంపెనీలు ఇండియాకు చెందిన పలువురిని డైరెక్టర్లుగా నియమించుకున్నాయి. 

ఎలాంటి సమస్యలు వచ్చినా తమ మీదకు రాకుండా ఉండేందుకు డైరెక్టర్లను నియమించుకున్నాయి. చైనాకు చెందిన కొందరితోపాటు ఇండియాకు చెందిన వాళ్ళతో ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాయి. డబ్బుల కోసం ఆశ పడి ఇండియన్లు డైరెక్టర్లుగా చేరారు. కాగా ఇప్పటికే 16 కంపెనీలపై పోలీసులు దాడులు చేసి మూసివేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీలో ఉన్న అసలు డైరెక్టర్లను పట్టుకుంటే నిజాలు బయటకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.

click me!