అయోధ్యలో రామ మందిర నిర్మాణం: రూ. 1 లక్ష విరాళమిచ్చిన కాంగ్రెస్ నేత

By narsimha lodeFirst Published Jan 19, 2021, 10:50 AM IST
Highlights

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రూ.1,11,111 రూపాయాలను విరాళంగా ఇచ్చారు.

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రూ.1,11,111 రూపాయాలను విరాళంగా ఇచ్చారు.

మత కల్లోహాలకు తాను వ్యతిరేకమని, ఆలయ నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశాడు.ఆ లేఖలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. 

రామ మందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా వీహెచ్‌పీ విరాళాల సేకరణను ఈ నెల 15వ తేదీన ప్రారంభించింది. ఈ విరాళాల సేకరణ సమయంలో దేశంలో పలు చోట్ల హింసాకాండ చోటు చోటు చేసుకొందని దిగ్విజయ్ సింగ్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

మహాత్మాగాంధీని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. మతం ఒక రాజకీయ సాధనం కాదన్నారు. ఆలయానికి విరాళం ఇవ్వడం వ్యక్తిగత ఎంపికగా భావించాల్సిన అవసరం ఉందన్నారు.బలవంతంగా విరాళాలు సేకరించవద్దని ఆయన కోరారు.

కర్రలు, కత్తులు, ఆయుధాలతో కొన్ని సంస్థలు విరాళాలు సేకరిస్తున్న విషయాన్ని ఆయన ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు ఒక సమాజానికి వ్యతిరేకంగా నినాదాలు  చేయడం సరైంది కాదన్నారు.

రామాలయం నిర్మాణానికి ఇతర మతాల ప్రజల నుండి వ్యతిరేకత లేదని మీకు తెలుసు. విరాళాల పేరిట నిధులు సేకరించే పని స్నేహాపూర్వక వాతావరణంలో జరగాలని ఆయన కోరారు.

click me!