ప్రేమ పేరిట మోసం.. టీవీ నటి పై పైలెట్ అత్యాచారం

Published : Jan 19, 2021, 10:49 AM ISTUpdated : Jan 19, 2021, 10:51 AM IST
ప్రేమ పేరిట మోసం.. టీవీ నటి పై పైలెట్ అత్యాచారం

సారాంశం

నిందితుడు తరచూ ఫోన్ లో మాట్లాడేవాడని, తామిద్దరం సోషల్ మీడియాలో ఛాట్ చేసేవారమని బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో తెలిపారు. 

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలను ఆమె నిజమేనని నమ్మేసింది. చివరకు ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. అనంతం ముఖం చాటేశాడు. ఈ దుర్ఘటన ఓ టీవీ నటి జీవితంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వివాహం సాకుతో తనపై పైలెట్ అత్యాచారం చేశాడని టీవీ నటి ముంబై నగరంలోని ఓషివారా పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసింది. బాధిత టీవీ నటికి నిందితుడు పైలెట్ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా  పరిచయమయ్యాడు. నిందితుడు తరచూ ఫోన్ లో మాట్లాడేవాడని, తామిద్దరం సోషల్ మీడియాలో ఛాట్ చేసేవారమని బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో తెలిపారు. 

పదిరోజుల క్రితం నిందితుడు కలిసేందుకు తమ ఇంటికి వచ్చి వివాహం చేసుకుంటానని వాగ్ధానం చేశాడు. నిందితుడు తనపై పలుసార్లు అత్యాచారం చేశాడని టీవీనటి పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత తనతో మాట్లాడటం మానేశాడని, తనపై అత్యాచారం చేసి, తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం