వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు : ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్.. సభ్యులుగా అమిత్ షా, అధిర్

Siva Kodati |  
Published : Sep 02, 2023, 06:20 PM IST
వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కమిటీ ఏర్పాటు : ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్.. సభ్యులుగా అమిత్ షా, అధిర్

సారాంశం

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై కేంద్ర ప్రభుత్వం శనివారం కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. 

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై కేంద్ర ప్రభుత్వం శనివారం కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, సీనియర్ రాజకీయ వేత్త గులాంనబీ ఆజాద్, ఎన్‌కే సింగ్, సుభాష్, హరీశ్ సాల్వే, సంజయ్ కోతారిలు సభ్యులుగా వ్యవహరిస్తారు. 

సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ ఆరోరా మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. వన్ నేషన్, వన్ పోల్  కోసం ఒకే ఓటర్ జాబితా ఉండాలని మోడీ కోరారు. దేశంలో ప్రతి కొన్ని నెలలకు ఒసారి ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ది కార్యక్రమాలపై పడుతోందన్నారు.ప్రతి కొన్ని నెలలకు వేర్వేరు ప్రదేశాలలో ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ది పనులకు ఆటకం కలిగే అవకాశం ఉందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: జమిలి ఎన్నికలంటే ఏమిటీ? ఈ విధానంతో ప్రయోజనాలు, ప్రతికూలతలు ఏమున్నాయ్?

దేశంలో ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన కొత్తది కాదు. కానీ దేశంలో ఇతర నాయకుల కంటే మోడీ దీని కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.2015లో ఈఎం సుదర్శన్ నాచియప్పన్ నేతృృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడ ఏక కాలంలో ఎన్నికలకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

2018లో లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో క్యాలెండర్ సంవత్సరంలో అన్ని ఎన్నికలు కలిసి నిర్వహించాలని సిఫారసు చేసింది.కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఒకేసారి దేశంలో ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా లేవు.ఇది అసాధ్యమైన ఆలోచనగా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.

ఇకపోతే.. కేంద్రం ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ప్రత్యక సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలు బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
 

PREV
Read more Articles on
click me!