కేరళలో బాంబు పేలుడు: ఒకరు మృతి, 20 మందికి గాయాలు

By narsimha lode  |  First Published Oct 29, 2023, 11:01 AM IST


కేరళ రాష్ట్రంలో ఇవాళ జరిగిన  బాంబు పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.


తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కాలమస్సేరిలో  ఆదివారంనాడు  బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.  ఎర్నాకుళంలో జిల్లాలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో  ఈ పేలుడు చోటు చేసుకుంది.  ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో  20 మంది గాయపడ్డారు క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ పేలుడు చోటు చేసుకుంది. వరుసగా మూడు దఫాలు  ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయని  ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Latest Videos

undefined

యెహూవా సాక్షి సమావేశంలో మూడు దఫాలు బాంబు పేలుళ్లు జరిగినట్టుగా  సమాచారం.యెహూవా సాక్షి సమావేశం పేరుతో శుక్రవారం నుండి ఆదివారం వరకు  సమావేశాలు నిర్వహిస్తారు.ఈ సమావేశాలు జరిగే ప్రాంతంలో  పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ఉగ్రదాడిగా  కూడ పోలీసులు అనుమానిస్తున్నారు. 

పేలుళ్లు జరిగిన సమయంలో ఈ కన్వెన్షన్ సెంటర్ లో  2 వేల మంది ఉన్నారు.  ఈ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన మూడు పేలుళ్లతో  ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.  మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో  ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.  క్షతగాత్రులను  స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుళ్లపై  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనతో  సెలవుల్లో ఉన్న వైద్యులను వెంటనే  విధుల్లో చేరాలని  కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ఆదేశించారు.  క్షతగాత్రులకు  మెరుగైన వైద్యం అందించాలని  కాలమెసిరి  మెడికల్ కాలేజీ సిబ్బందిని  ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు.

కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన   పేలుడు ఘటనపై  దర్యాప్తు నిర్వహిస్తున్నట్టుగా కేరళ సీఎం  పినరయి విజయన్ ప్రకటించారు.  ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆయన  ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని సీఎం తెలిపారు.  మొత్తం  36 మంది ఆసుపత్రిలో చేరారు. అయితే వీరిలో  10 మందికి 50 శాతానికి పైగా  కాలిన గాయాలున్నాయని  ఆసుపత్రి సిబ్బంది ప్రకటించారు.  

click me!