ఐరాసలో గాజాపై యుద్ధ విరమణ తీర్మానానికి ఓటేయని ఇండియా.. పాలస్తీనాకు సంఘీభావంగా సీపీఎం కార్యక్రమం

By Mahesh K  |  First Published Oct 28, 2023, 10:12 PM IST

గాజాపై ఇజ్రాయెల్ కాల్పులను విరమించాలనే తీర్మానాన్ని ఐరాస సాధారణ అసెంబ్లీ ప్రవేశపెట్టగా. . పెద్ద సంఖ్యలో దేశాలు అనుకూలంగా ఓటేశాయి. కానీ, భారత్ మాత్రం ఈ తీర్మానంపై ఓటేయలేదు. ఈ పరిణామంపై సీపీఐ, సీపీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పాలస్తీనాకు సంఘీభావంగా నిరసన చేస్తామని అవి ప్రకటించాయి.
 


న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో గాజాపై కాల్పులను విరమించాలనే తీర్మానం ప్రవేశపెట్టగా.. భారత్ ఓటేయలేదు. దీనిపై వామపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచాయి. భారత్ తీరు షాకింగ్‌గా ఉన్నదని, మన దేశ విదేశాంగ విధానం అమెరికా సామ్రాజ్యవాదానికి సబార్డినేట్‌గా మారుతున్నట్టుగా ఉన్నదని సీపీఎం, సీపీఐలు శనివారం ఉమ్మడి ప్రకటన చేశాయి.

ఏకేజీ భవన్ కార్యాలయంలో పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ నిరసన చేపడతామని సీపీఎం ప్రకటించింది. పాలస్తీనా సమస్యపై దీర్ఘకాలంగా భారత్ అవలంభిస్తున్న వైఖరిని తాజా నిర్ణయం నీరుగార్చేలా ఉన్నదని సీపీఎం జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి, సీపీఐ జనరల్ సెక్రెటరీ డీ రాజా విమర్శించారు. ‘ఐరాస సాధారణ అసెంబ్లీ అనూహ్య మెజార్టీతో ఆమోదించిన మానవతా సంధికి భారత్ దూరంగా ఉండటం షాకింగ్‌గా ఉన్నది’ అని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో దేశాలు మొగ్గు చూపిన దానికి భిన్నంగా భారత్ ఓటు వేయడానికి దూరంగా ఉండటం మన దేశం విదేశాంగ విధానం అమెరికా సామ్రాజ్యవాదానికి ఒక బంటుగా, అమెరికా, ఇంజ్రాయెల్‌ల అరాచకానికి మోడీ ప్రభుత్వ చర్యలు వత్తాసు పలుకుతున్నట్టుగా ఉన్నాయని ఫైర్ అయ్యారు.

Latest Videos

undefined

Also Read: కేరళలో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో హమాస్ నేత వర్చువల్ ప్రసంగం.. కేరళ బీజేపీ ఫైర్

గాజా పట్టిపై ఇజ్రాయెల్ గగనతల, భూతల దాడులు ముమ్మరం చేసిన తరుణంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని గౌరవించి ఇజ్రాయెల్ వెంటనే కాల్పులను విరమించుకోవాలని వారు కోరారు. 1967కు ముందటి సరిహద్దులు, తూర్పు జెరూసలేం పాలస్తీనా రాజధానిగా, రెండు దేశాల పరిష్కారం కోసం భద్రతా మండలి ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఐరాస తనను తాను శక్తివంతం చేసుకోవాలనీ వామపక్ష పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు.

click me!