గుజరాత్ లోని సూరత్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు ఆత్మహత్యకు ఒడిగట్టారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఓ ఇంట్లో ఏడుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు ఉండటం విచారకరం. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 37 ఏళ్ల మనీష్ సోలంకి అనే వ్యక్తి కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు ఓ భార్య, తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
బాలికపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారయత్నం.. ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో దుశ్చర్య..
పిల్లల్లో కుమారుడికి ఆరేళ్లు ఉండగా.. ఓ కూతురుకు పదేళ్లు, మరో కూతురుకు 13 ఏళ్ల వయస్సు ఉంటుంది. వీరంతా సూరత్ లోని ఓ కాలనీలో నివసిస్తున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ.. శనివారం ఉదయం వీరంతా వారి ఇంట్లో విగతజీవులై కనిపించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కేరళలో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో హమాస్ నేత వర్చువల్ ప్రసంగం.. కేరళ బీజేపీ ఫైర్
ఆ ఇంట్లో పోలీసులకు గాలించగా.. విషం సీసా లభ్యం అయ్యింది. అలాగే ఓ సూసైడ్ నోట్ కూడా దొరికింది. తాము ఆర్థిక సమస్యలతోనే తనువు చాలిస్తున్నామని వెల్లడించారు. కాగా.. ఇంటి యజమాని ముందుగా ఫ్యామిలీ అంతటికి విషం ఇచ్చి, తరువాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి డెడ్ బాడీలను పోలీసులు పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.
కాంగ్రెస్ గెలుపు సర్వేల నుండి బిజెపి బిసి సీఎం వరకు : నెటిజన్ల సూటి ప్రశ్నలు, కవిత సమాధానాలివే..
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.