బక్రీద్ రోజున బలివ్వడానికి బర్రెను తీసుకొస్తే.. ట్రక్కులో నుంచి దూకి, అందరినీ తొక్కుకుంటూ.. బీభత్సం.. వైరల్

Published : Jun 28, 2023, 01:23 PM IST
బక్రీద్ రోజున బలివ్వడానికి బర్రెను తీసుకొస్తే.. ట్రక్కులో నుంచి దూకి, అందరినీ తొక్కుకుంటూ.. బీభత్సం.. వైరల్

సారాంశం

బక్రీద్ రోజున బలివ్వడానికి కొనుగోలు చేసి, తీసుకొచ్చిన బర్రె బీభత్సం సృష్టించింది. ట్రక్కు నుంచి దూకి ప్రజలు మీదికి దూసుకెళ్లింది. యూపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ముస్లింలు త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగ సమీపించింది. ఈ నేపథ్యంలో ఆ పండగను నిర్వహించునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పండగ రోజు బలి ఇచ్చేందుకు మేకలు, గేదెలు వంటివి సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇలాగే యూపీలో బక్రీద్ రోజు బలివ్వడానికి ఓ బర్రెను తీసుకొస్తే.. అది ట్రక్కులో నుంచి దూకి బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యూనిఫాం సివిల్ కోడ్ ను హిందువులకే ముందుగా వర్తింపజేయండి - డీఎంకే

వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మొరాబాబాద్ లో రద్దీగా ఠాణా గల్షాహీద్ ప్రాంతంలోని పత్తర్ చౌక్ మార్కెట్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ట్రక్కు వచ్చి ఆగింది. అందులో బర్రెలు ఉన్నాయి. బక్రీద్ పండగ రోజు బలివ్వడానికి వాటిని తీసుకొచ్చారు. వాటిని చూసేందుకు ఆ మార్కెట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ఆ జంతువులను ఆసక్తిగా గమనిస్తున్నారు. 

ఆ ట్రక్కు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఆ బర్రెలను కిందకి దించేందుకు పలువురు ప్రయత్నించారు. అయితే అందులో ఉన్న ఓ బర్రె ఆకస్మాత్తుగా కిందకి దూకింది. కోపంగా అటూ ఇటూ పరిగెత్తింది. అక్కడున్న పలు దుకాణాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అది వేగంగా ఎటు పడితే అటే పరిగెత్తడంతో మార్కెట్లో తొక్కిసలాట లాంటి పరిస్థితి నెలకొంది.

తోడికోడళ్లు తరచూ గొడవ పడుతున్నారని.. ఒకరి తల నరికిన మామ.. రక్తపు చేతులతోనే పోలీసు స్టేషన్ కు వెళ్లి..

ఆ గేదెను పట్టుకునేందుకు కొందరు పరుగులు తీస్తుండగా.. దాని నుంచి తప్పించుకునేందుకు మరి కొందరు పరిగెత్తారు. ఇలా ఆ ప్రాంతంలో గంటల తరబడి డ్రామా కొనసాగింది. కొన్ని కిలోమీటర్ల దూరం పరిగెత్తి, అక్కడున్న వారిని ఆ బర్రె ముప్పుతిప్పలు పెట్టింది. అయితే చాలా ప్రయత్నాలు తరువాత ఆ జంతువు వారి నియంత్రణలోకి వచ్చింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్