
మహారాష్ట్ర : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక హౌసింగ్ సొసైటీలో మేక కలకలానికి కారణం అయ్యింది. అందులో నివసించే ఓ వ్యక్తి బక్రీద్‌కు ముందు తన ఇంటికి మేకను తీసుకువచ్చాడు. దీన్ని సొసైటీలోని మిగతావారు వ్యతిరేకించినట్లు పోలీసులు ఈరోజు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీనిమీద భయాందర్ ప్రాంతంలో ఉన్న హౌసింగ్ సొసైటీ సభ్యులు పోలీసులను పిలిపించారు.
వారు నివాసితులతో చర్చలు జరిపి.. శాంతింపజేశారని మీరా రోడ్ పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అన్నారు. మేకను అతను తన ఇంటికి తీసుకెళ్లడం చూసిన ప్రజలు.. అరుపులు, కేకలు వేయడం.. అతడిని అడ్డుకోవడంతో హౌసింగ్ సొసైటీలో కోలాహలం ఏర్పడింది.
కూతురి పెళ్లి రోజే.. తండ్రిని నరికి చంపిన మాజీ ప్రేమికుడు...
బక్రీద్‌కు ముందు మేకను పెట్టడానికి వేరే స్థలం లేకపోవడంతో ఆ వ్యక్తి ప్రతి సంవత్సరం.. తన ఇంటికి తీసుకువస్తాడని.. ఈ విషయాన్ని ముందుగానే పోలీసులకు తెలియజేస్తాడని పోలీసు అధికారి తెలిపారు. "అతను మరుసటి రోజు మేకను తీసుకువెళతాడు. అతని ఇంట్లో జంతువును వధించబడదు" అని అధికారి స్పష్టం చేశారు.
పోలీసుల సమక్షంలో మేకను అతని ఇంట్లోనుంచి బయటకు తీసుకురావాలని చెప్పామని తెలిపారు. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎలాంటి నేరం నమోదు కాలేదని అధికారి తెలిపారు.