దొంగతనం చేశారనే అనుమానంతో బలవంతంగా మూత్రం తాగించి, మలద్వారంలో మిరపకాయలు రుద్ది.. వీడియో వైరల్

By Asianet News  |  First Published Aug 6, 2023, 1:37 PM IST

దొంగతనం చేశారనే అనుమానంతో పలువురు యువకులు ఇద్దరు బాలురపై చిత్ర హింసలకు పాల్పడ్డారు. వారితో బలవంతంగా మూత్రం తాగించారు. పచ్చి మిరపకాయలు తినిపించారు. వాటిని మలద్వారంలో కూడా రుద్దారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు బాలురపై యువకులు దారుణంగా ప్రవర్తించారు. వారితో బలవంతంగా మూత్రం తాగించి, మలద్వారంలో పచ్చి మిరపకాయలను రుద్దారు. అలాగే గుర్తు తెలియని ఇంజెక్షన్లను కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.

హర్యానాలో మత ఘర్షణలు.. నుహ్ లో రాళ్లు విసిరేందుకు అవకాశం ఇచ్చిన హోటల్ కూల్చివేత..

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో 10, 15 ఏళ్ల చిన్నారులపై పలువురు యువకులు అమానుషంగా ప్రవర్తించారు. డబ్బు దొంగతనం చేశారని వారిపై అభియోగాలు మోపుతూ ఆ బాలురను పట్టుకొని కట్టేశారు. అనంతరం వారితో పచ్చి మిరప కాయలు తినిపించారు. ఓ బాటిల్ లో మూత్రం నింపి దానిని తాగాలని బలవంతం చేశారు. చెప్పినట్టు చేయకపోతే చితకబాదుతామని బెదిరించారు. 

మద్యం మత్తులో స్నేహితుడి రక్తం తాగాలని ప్రయత్నం.. ప్రాణాలకే ముప్పు తెచ్చిన కోరిక.. అసలేమైందంటే ?

మరో వీడియోలో బాలురు వీపు వెనుక చేతులు కట్టుకుని, ప్యాంటు కిందకు లాగి నేలపై పడుకొని ఉన్నారు. ఓ వ్యక్తి పచ్చి మిరపకాయలను మలద్వారంలో రుద్దుతూ విసిరేస్తున్నాడు. దీంతో బాలురు నొప్పిని భరించలేక విపరీతంగా కేకలు వేశారు. అప్పటికే నొప్పితో అస్వస్థత పడుతున్న బాలురలకు గుర్తు తెలియని ఇంజక్షన్ కూడా ఇచ్చారు. అందులో ఉన్న ద్రవం పసుపు రంగులో ఉంది. దీనిని అక్కడున్న వారు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు.

అర్థరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మరణం.. మరో ముగ్గురికి గాయాలు

ఆగస్టు 4వ తేదీన వెలుగులోకి వచ్చిన ఈ వీడియో జిల్లాలోని పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంకటి చౌరాహా సమీపంలోని అర్షన్ చికెన్ షాప్ లో జరిగిందని గుర్తించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నిందితులను పోలీసులు గుర్తించారు. వారిపై సంబంధింత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించామని, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా అదనపు ఎస్పీ సిద్ధార్థ ‘ఎన్డీటీవీ’తో తెలిపారు.

click me!