ఏ అధికారైనా మీ మాట వినకుంటే కర్రలతో బాదండి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 7, 2021, 5:50 PM IST
Highlights

సంచలన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లోకెక్కే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి అదే తరహా వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయన అధికారులను టార్గెట్ చేశారు.

సంచలన వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లోకెక్కే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి అదే తరహా వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయన అధికారులను టార్గెట్ చేశారు.

విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులను వెదురు కర్రలతో కొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఆదివారం బెగుసరాయ్‌లోని ఖోడావాండ్‌పూర్‌లో ఉన్న అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే మీ ఇబ్బందులు పట్టించుకోకుంటే వెదురు కర్రతో బాదండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనమేమీ అధికారులను అక్రమమైన పనులు చేయమనో, నగ్న నృత్యాలు చేయమనో అడగడం లేదంటూ గిరిరాజ్ అన్నారు.

చిన్న చిన్న పనుల కోసం ప్రజలు నా వద్దకు రావాల్సిన పని లేదని చెబుతుంటానని స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, విలేజ్ ముఖియాలు, డీఎంలు, ఎస్డీఎంలు, బీడీఓలు ఉన్నారని గిరిరాజ్ సింగ్ గుర్తుచేశారు.

ప్రజలకు సేవ చేయడమే వీరి పని అన్న మంత్రి... వారు మీ మాటలు వినకుంటే రెండు చేతులతో వెదురు కర్రలు తీసుకుని వాళ్ల తలపై బలంగా మోదండి' అని పిలుపునిచ్చారు. అప్పటికీ అధికారులు మాట వినకుంటే స్వయంగా తానే ప్రజలకు అండగా నిలబడతానని గిరిరాజ్ సింగ్ భరోసా ఇచ్చారు.

click me!