తమిళనాడులో బీజేపీ, అన్నాడిఎంకె కూటమిదే అధికారం: అమిత్ షా

By narsimha lodeFirst Published Mar 7, 2021, 4:11 PM IST
Highlights

తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకె కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమాను వ్యక్తం చేశారు.

చెన్నై: తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకె కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమాను వ్యక్తం చేశారు.

ఆదివారం నాడు కన్యాకుమారి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అమిత్ షా కన్యాకుమారి ఎంపీ స్థానంలో ప్రచారం నిర్వహించారు.ఈ స్థానం నుండి మాజీ కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ ను బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.  రాధాకృష్ణన్ తో కలిసి అమిత్ షా ప్రచారం నిర్వహించారు.

జిల్లాలో ఇంటింటి ప్రచారాన్ని అమిత్ షా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కన్యాకుమారి లోక్‌సభ స్థానంలోనే కాదు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, అన్నాడీఎంకె కూటమి సత్తా చాటుతోందని చెప్పారు.

ప్రచారంలలో ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఫలితం కచ్చితంగా అర్ధమౌతోందన్నారు.  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, అన్నాడిఎంకె పొత్తుతో పోటీ చేస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 20 అసెంబ్లీతో పాటు కన్యాకుమారి ఎంపీ సీటును అన్నాడిఎంకె కేటాయించింది.

click me!