
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని జ్యూయలరీ, బులియన్ రంగాలకు చెందిన రెండు సంస్థలపై ఆదాయ పప్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
దక్షిణ భారతంలోని ప్రముఖ జ్యూయలరీ సంస్థతో పాటు బులియన్ వ్యాపారి సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
దేశంలోని 27 చోట్ల ఈ సోదాలు సాగుతున్నాయి. చెన్నై, ముంబై, కోయంబత్తూరు, మధురై, త్రిసూర్, నెల్లూరు, జైపూర్, ఇండోర్ లలో ఈ సంస్థల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ. 1000 కోట్ల మేరకు లెక్క తేలని ఆదాయాన్ని అధికారులు గుర్తించారు.
బులియన్ వ్యాపారి సంస్థల్లో లెక్క తేలని ఆదాయం లభించినట్టుగా చెబుతున్నారు. బోగస్ క్యాష్ బిల్లులు, డమ్మీ ఖాతాల ద్వారా నగదు క్రెడిట్ అయినట్టుగా గుర్తించారు.
జ్యూయల్లరీ వ్యాపారి నుండి కీలక పత్రాలను స్వాధీనం ,చేసుకొన్నారు. స్థానిక ఫైనాన్స్ వ్యాపారి నుండి అప్పు తీసుకొని తిరిగి చెల్లించాడు. రియల్ ఏస్టేల్ ఆస్తుల్లో నగదు పెట్టుబడులు పెట్టాడు.