ప్రభుత్వ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్.. అదనంగా 2 స్పెషల్ హాలీడేస్.. వాటిని అలా వాడకపోతే పనిష్మెంట్...ఎక్కడంటే...

Published : Jan 03, 2022, 01:44 PM IST
ప్రభుత్వ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్.. అదనంగా 2 స్పెషల్ హాలీడేస్.. వాటిని అలా వాడకపోతే పనిష్మెంట్...ఎక్కడంటే...

సారాంశం

జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. ఆపై 8వ తేదీ రెండో శనివారం.. 9వ తేదీ ఆదివారం…కూడా సెలవు దినాలు. అంటే మొత్తం వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి.  ఇక ప్రత్యేక సెలవుల కోసం ముందుగా ఉద్యోగులు తమ సీనియర్ అధికారులకు లీవ్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

అసోం : సాధారణంగా చాలా వరకు ప్రభుత్వ ఆఫీసులకు Second Saturday, ఆదివారం వరుస సెలవులు ఉంటాయనేది తెలిసిన విషయమే. కానీ ఆ రాష్ట్రంలో మాత్రం ఈ వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండు రోజులు అదనపు సెలవులు ప్రకటించారు.  దీని వెనక ఓ పెద్ద కారణమే  ఉందట.  అదేమిటంటే…

అస్సాం ప్రభుత్వం ఉద్యోగుల కోసం అరుదైన ప్రకటన చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ special leaves మంజూరు చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి Himanta Bishwa Sharma స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఈ సమయం కేటాయించండంటూ ఆయన పేర్కొన్నారు.  ఈ మేరకు Assam సాధారణ పరిపాలక విభాగం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. ఆపై 8వ తేదీ రెండో శనివారం.. 9వ తేదీ ఆదివారం…కూడా సెలవు దినాలు. అంటే మొత్తం వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి.  ఇక ప్రత్యేక సెలవుల కోసం ముందుగా ఉద్యోగులు తమ సీనియర్ అధికారులకు లీవ్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Coronavirus: మెడికల్‌ కాలేజీలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా

సోమవారం  (జనవరి 10వ తేదీ)  తిరిగి విధుల్లోకి వచ్చేటప్పుడు.. ప్రత్యేక సెలవుల్లో (ఆ రెండు రోజుల పాటు) కుటుంబంతోనే గడిపినట్లు ఫోటోల్ని ఆధారాలుగా సమర్పించాల్సి ఉంటుంది.  అంతేకాదు ఈ హాలిడేస్ ఫోటోని ప్రభుత్వం నిర్వహించే పోర్టల్ లోనూ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ ప్రత్యేక లీవులు కాస్త క్యాజువల్ లీవ్ లుగా మారిపోతాయి.  అంతేకాదు ప్రత్యేక సెలవులని దుర్వినియోగం చేసినందుకు చర్యలు కూడా ఉంటాయి.

టాప్ సివిల్ సర్వెంట్ నుంచి ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగుల దాకా అందరికీ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇక్కడ ఒక కొసమెరుపు ఏమిటంటే….  తల్లిదండ్రులు లేని ఉద్యోగులకు ఈ సెలవుల నిబంధన వర్తించదు. అలాగే ఆ లీవ్స్ ను తర్వాత ఉపయోగించుకోవడానికి కూడా వీలు లేదు.  ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు అవకాశం ఇచ్చిన హిమంత సర్కార్ పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.   నవంబర్లోనే ఈ జీవోకు అస్సాం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌