మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో ఈరోజు నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ ఆంక్షలు జనవరి 7వ తేదీ వరకు ఉంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఒమిక్రాన్ కలవరపెడుతోంది. రోజు రోజుకు దేశంలో కేసులు సంఖ్య పెరుగుతోంది. దక్షిణాఫ్రికాలో మొదట వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రతీ దేశంలోనూ ఈ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇండియాలో డిసెంబర్ 2వ తేదీన మొదటి రెండు కేసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసుల సంఖ్య 900 సంఖ్యను దాటింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. కరోనాను అదుపులో ఉంచడానికి ఆంక్షలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ, కర్నాటక తో పాటు పలు రాష్ట్రాలు క్రిస్మస్ వేడుకలు, న్యూయర్ వేడుకలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. నేటి నుంచి ఆ రాష్ట్రంలోని ముంబై పట్టణంలో 144 సెక్షన్ విధించింది. ఇది జనవరి 7వ తేదీ వరకు కొనసాగనుందని ప్రభుత్వం తెలిపింది.
గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు: కాళీచరణ్ మహరాజు అరెస్ట్
undefined
ముంబైలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల్లో దేశంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో మొదటి స్థానంలో ఉంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. మహారాష్ట్ర విస్తీర్ణంలో చాలా పెద్ద రాష్ట్రం. గత రెండు వేవ్‌లు ఆ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాయి. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది. లాక్‌డౌన్ విధించాల్సి వస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నామవుతుంది. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆ తేదీ వరకు రెస్టారెంట్లు, హోటళ్లు, బార్‌లు, పబ్‌లు, రిసార్ట్‌లు మరియు క్లబ్‌లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కూడా న్యూయర్ వేడుకలు నిర్వహించకూడదు. పార్టీలను పూర్తిగా నిషేదించారు.
చోరీకి వాడిన రాడ్ కోసం నీళ్లు తోడితే.. పోయిన బంగారం దొరికింది.. తమిళనాడులో విచిత్రం..
అధికారులతో సమావేశం అనంతరం..
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఆదిత్య ఠాక్రే బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్, ఇతర ముఖ్య ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసుల పరిస్థితిని సమీక్షించారు. కరోనా నివారణ కోసం 144 సెక్షన్ విధించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ఈ నిర్ణయంపై ప్రకటన చేశారు. ముంబైలో కరోనావైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కోరారు మంత్రి ఆదిత్య ఠాక్రే కోరారు. అందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని కోరారు. డిసెంబర్ 31వ తేదీన ముంబైలోని అన్ని బహిరంగ ప్రదేశాలు ప్రదేశాలు మూసివేయబడతాయని చెప్పారు. న్యూయర్ వేడుకల సందర్భంగా ఎవరైనా COVID-19 మార్గదర్శకాలను ఉల్లంఘింస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటానమి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలను కొన్ని నెలల పాటు మూసి వేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 188 ఒమిక్రాన్ ఏసులు చేరుకున్నాయి. అలాగే 2,510 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు.