నా కుటుంబం మరోసారి గృహ నిర్బంధం: ఒమర్ అబ్దుల్లా

Published : Feb 14, 2021, 12:26 PM IST
నా కుటుంబం మరోసారి గృహ నిర్బంధం: ఒమర్ అబ్దుల్లా

సారాంశం

నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కుటుంబాన్ని అధికారులు గృహ నిర్భంధించారు. ఈ విషయాన్ని ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

న్యూఢిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కుటుంబాన్ని అధికారులు గృహ నిర్భంధించారు. ఈ విషయాన్ని ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

తనతో పాటు తన తండ్రి, ఎంపీ ఫరూక్ అబ్దుల్లాను  కూడ హౌస్ అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. 2019 ఆగష్టు తర్వాత కొత్త జమ్మూ కాశ్మీర్ లో  తమ ఇళ్లల్లోనే నిర్భంధించబడినట్టుగా ఆయన చెప్పారు. 

తన సోదరిని ఆమె పిల్లలను కూడ ఆమె నివాసంలో నిర్భంధించారని ఆయన ట్విట్ లో పేర్కొన్నారు.తన నివాసం వెలుపల పోలీస్ వాహనాలను చూపించే ఫోటోలను కూడ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.తన ఇంటి సిబ్బందిని పోలీసులు అనుమతించలేదన్నారు. 

 

అథర్ ముష్తాక్ కుటుంబాన్ని సందర్శించడానికి ముందే ఆమెను గృహ నిర్భంధంలో ఉంచినట్టుగా పీడీపీ అధ్యక్షుడు మెహబూబా ముఫ్తీ శనివారం నాడు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..