రాజస్థాన్ లోని సరిస్కాలో నివసించిన అతి పురాతనమైన పులి ఎస్టీ - 2 మరణించింది. తోకలో ఇన్ఫెక్షన్ సోకడంతో చాలా కాలంగా అది చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో మంగళవారం అది మృత్యువాత పడింది.
రాజస్థాన్ లోని అల్వార్ లోని సరిస్కా టైగర్ రిజర్వ్ (ఎస్టీఆర్)లో ఉన్న అతి పెద్ద పులి ఎస్టీ-2 మరణించింది. దాని తోకకు గాయమై, ఇన్ఫెక్షన్ సోకడంతో సరిస్కా అభయారణ్యంలోని నయా పానీ ప్రాంతంలోని కరంకబాస్ ఎన్ క్లోజర్ లో వృద్ధ పులి చాలా కాలంగా చికిత్స పొందుతోంది.
ST-2 (Rajmata) was the second female tiger that was translocated to Sariska Tiger Reserve. Since the relocation, She became the first female to produce cubs and started the legacy of tigers at Sariska. will forever be indebted to ST-2A pic.twitter.com/Yl32hfzDIi
— Panthera Trails (@PantheraTrails)అయితే ఎప్పుడూ చురుకుగా ఉండే ఎస్టీ-2 మంగళవారం మాత్రం నీరసంగా కనిపించింది. మధ్యాహ్నం వరకు ఒకే చోట కూర్చుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు పులిలో ఎలాంటి కదలిక కనిపించలేదు. అనుమానం వచ్చిన మానిటరింగ్ టీం, సిబ్బంది ప్రభుత్వ వాహనంతో ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించారు. పులిని పరిశీలించి, అది మృతి చెందినట్లు గుర్తించారు.
undefined
TS HighCourt: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట..
దీంతో పశువైద్యుల బృందం నేడు పులికి పోస్టుమార్టం నిర్వహించనుంది. ఎస్టీ-2 పులి వయసు 19 ఏళ్లని అక్కడి అధికారులు తెలిపారు. దానిని అక్కడి సంరక్షణ బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చేది. ఎస్టీ-2ను 2008 జూలై 4న రణథంబోర్ నుంచి సరిస్కా టైగర్ రిజర్వ్ కు తరలించారు.
తెలంగాణ బ్రదర్స్ ఆండ్ సిస్టర్స్ ... తస్మాత్ జాగ్రత్త..! : కేటీఆర్ హెచ్చరిక
ఈ ప్రాంతంలో అదే మొదటి పెద్ద పులి కావడం గమనార్హం. దానిని రణతంబోర్ నుండి అల్వార్‌లోని సరిస్కాకు తీసుకువచ్చారు. ఆ తర్వాతే సరిస్కాలో పులుల గర్జన మళ్లీ ప్రతిధ్వనించింది. అంతకు ముందు ఆ ప్రాంతంలో పులులు లేవు. ఈ పులి తన జీవిత కాలంలో ఎస్టీ-7, ఎస్టీ-8, ఎస్టీ-13, ఎస్టీ-14 అనే పులులకు జన్మనిచ్చింది.