ఉత్తర్ ప్రదేశ్‌లోని అమ్రోహాలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి: మరో ఇద్దరి పరిస్థితి విషమం

By narsimha lode  |  First Published Jan 10, 2024, 11:13 AM IST

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహాలో  ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెందారు.ఈ ఘటనపై  పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


న్యూఢిల్లీ:  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా గ్రామంలో ఒకే కుటుంబంలోని  ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బొగ్గు వల్ల వెలువడిన పొగతో  ఊపిరాడక  ఐదుగురు మృతి చెందినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు అమ్రోహాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నాడు రాత్రి బాధితులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సోమవారం నాడు రాత్రి నుండి ఈ ఇంట్లో ఉండే ఏడుగురిలో ఎవరూ కూడ బయటకు రాలేదు. దీంతో  మంగళవారం నాడు సాయంత్రం గ్రామస్తులు తలుపులు పగులగొట్టారు. అయితే  అప్పటికే  ఏడుగురు అపస్మారక స్థితిలో పడి ఉన్నారని పోలీసులు చెప్పారు.

Latest Videos

వెంటనే  స్థానికులు ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు.  అయితే  సోనమ్, వారిస్, మెహకర్ జైద్, మహిర్ లు మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.  మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు తెలిపారు. 

గదిలో పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందినట్టుగా  వైద్యులు అనుమానిస్తున్నారు.  ఈ ఐదుగురి మృతికి గల కారణాలపై విచారణ జరుపుతామని పోలీసులు ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్ మాసంలో కర్ణాటకలోని దొడ్డబళ్లాపురంలో కూడ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గది వేడిగా ఉండేందుకు  బొగ్గులతో మంటను ఏర్పాటు చేశారు.దీంతో  వచ్చిన పొగతో ఊపిరాడక  నలుగురు సభ్యులు నిద్రలోనే మృతి చెందారు.

మూసిఉన్న గదిలో బొగ్గును కాల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఏర్పడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్బన్‌డైఆక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్  తదితర హానికరమైన వాయువులను బొగ్గు విడుదల చేస్తుంది.
 

click me!