విమానంలో వృద్ధుడి అసభ్యకరమైన చేష్టలు.. ఎయిర్ హోస్టెస్ లోదుస్తులు కనిపించేలా వీడియో రికార్డ్..

Published : Aug 19, 2023, 11:43 AM IST
విమానంలో వృద్ధుడి అసభ్యకరమైన చేష్టలు.. ఎయిర్ హోస్టెస్ లోదుస్తులు కనిపించేలా వీడియో రికార్డ్..

సారాంశం

ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో ఓ వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఓ ఎయిర్ హోస్టెస్ లోదుస్తులు కనిపించేలా వీడియో తీశాడు. ఈ ఘటన ఆగస్టు 2వ తేదీన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఓ వృద్ధుడి విమానంలో అసభ్యకరమైన చేష్టలకు పాల్పడ్డాడు. ఎయిర్ హోస్టెస్ ను ఆమెకు తెలియకుండా అభ్యంతరకరమైన విధంగా వీడియో తీశాడు. ఆమె లోదుస్తులు కనిపించేలా వీడియో రికార్డు చేశాడు. ఈ దుశ్చర్యను ఓ వ్లాగర్ రికార్డ్ చేయడంతో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం 157లో ఓ వృద్ధుడు ఎయిర్ హోస్టెస్ ను అసభ్యకరంగా ఫొటోలు తీశాడు. ఓ వ్లాగర్ ఈ ఘటనను తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో పోస్ట్ చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. ‘‘మా సీటు ఏ, బీ, సీలో ఓ వృద్ధుడు కూర్చొని దారుణానికి పాల్పడ్డాడు. ఓ ఫ్లైట్ అటెండెంట్ అతడికి సేవ చేస్తున్న సమయంలో ఆమె లోదుస్తులను వీడియో తీయడానికి ప్రయత్నించాడు’’ అని వ్లాగర్ తెలిపాడు.

ఆ వృద్ధుడు తీసిన అనుచిత ఫోటోలు అతడి ఫోన్లో కనిపించాయని వ్లాగర్ పేర్కొన్నాడు. ‘‘ వాటిని గమనించిన తర్వాత ఎయిర్ హోస్టెస్ కు సమాచారం అందించాను. దీంతో ఆమె అతడి ఫోన్ చెక్ చేసింది. అందులో ఆమె కాలు, లోదుస్తులకు సంబంధించిన వీడియో కూడా అందులో కనిపించాయి. అని బాధితురాలు చెప్పింది’’ అని వ్లాగర్ చెప్పాడు. 

కాగా.. ఈ ఘటను విమానయాన సంస్థ కూడా ధృవీకరించింది. ఈ దుశ్చర్యను గుర్తించిన తరువాత ప్రయాణికుడు అతడి ఫోన్ నుంచి ఫొటోలను, వీడియోలను డిలీట్ చేశాడని తెలిపింది. అనంతరం అతడు చేసిన పనికి క్షమాపణలు చెప్పాడని పేర్కొంది. ఆగస్టు 2న ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం ఎస్ జీ 157 మొదటి వరుసలో కూర్చున్న ఓ ప్రయాణికురాలు టేకాఫ్ సమయంలో జంప్ సీటులో కూర్చొని క్యాబిన్ సిబ్బంది ఫొటోలు తీస్తున్నట్లు గుర్తించినట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది.  ‘ఇండియా టుడే’ నివేదించింది. ‘‘ ప్రయాణికుడిని సిబ్బంది అడ్డుకున్నారు. అతడు తన ఫోన్ నుంచి ఆ ఫొటోలను డిలీట్ చేసి తన చర్యకు క్షమాపణలు చెప్పాడు. ప్రయాణికుడు లిఖితపూర్వక క్షమాపణలు కూడా చెప్పాడు’’ అని పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌