మేనమామ కొడుకులతో ఫోన్ లో మాట్లాడుతున్నారని.. జుట్టు పట్టి ఈడుస్తూ.. కర్రలతో చితకబాది....

Published : Jul 05, 2021, 09:56 AM IST
మేనమామ కొడుకులతో ఫోన్ లో మాట్లాడుతున్నారని.. జుట్టు పట్టి ఈడుస్తూ.. కర్రలతో చితకబాది....

సారాంశం

మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఫోన్ లో మాట్లాడుతున్నారని ఇద్దరు యువతులను కుటుంబసభ్యలే దారుణంగా చితకబాదారు. మేనమామ కొడుకులతో ఫోన్ లో మాట్లాడుతున్నారని ఈ అమానుషానికి దిగజారారు.

మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఫోన్ లో మాట్లాడుతున్నారని ఇద్దరు యువతులను కుటుంబసభ్యలే దారుణంగా చితకబాదారు. మేనమామ కొడుకులతో ఫోన్ లో మాట్లాడుతున్నారని ఈ అమానుషానికి దిగజారారు.

ఆగ్రహంతో ఇద్దరు గిరిజన అక్కాచెల్లెళ్లను సొంత కుటుంబ సభ్యులే జుట్టు పట్టి ఈడుస్తూ.. కర్రలతో చితకబాదిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి చేసినవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేశారు. 

మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా పిపల్ గ్రామంలో జూన్ 22న ఈ ఘటన జరిగింది. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు దీని మీద దృష్టి పెట్టారు. 19, 20 యేళ్ల వయసున్న బాధితురాళ్లను స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం