Cheetah:  భార‌త్ లో వినిపించ‌నున్న చిరుత గ‌ర్జ‌న‌.. ఆఫ్రికా నుంచి భార‌త్ కు దిగుమ‌తి.. 

By Rajesh KFirst Published Aug 9, 2022, 3:16 AM IST
Highlights

Cheetah : భారత దేశంలో దాదాపు  70 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చిరుత పులులను విదేశాలనుంచి దిగుమతి చేసుకుని తిరిగి భారత్ లోని అడవులలో పెంచనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. వీటిని మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని షియోపూర్ జిల్లాలోని కునో-పాల్పూర్ నేషనల్ పార్క్‌లో విడిచిపెట్ట‌నున్నారు.

Cheetah: భార‌త్ లో దాదాపు 70 ఏళ్ల తర్వాత అంతరించిపోయిన చిరుతపులి గర్జన మళ్లీ వినిపించనుంది. ఈ మేర‌కు చిరుతలను దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. సుమారు 10 సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. 

భార‌త దేశంలో ఈ జాతికి చెందిన చివరి చిరుత 1947లో అవిభక్త మధ్యప్రదేశ్‌లోని కొరియా ప్రాంతంలో ఉండేవి. ఇది ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. తరువాత 1952 లో ఈ జాతికి చెందిన చిరుత దేశంలో అంతరించిపోయినట్లు ప్రకటించబడింది. ఈ చిరుత జాతుల వేగం గంటకు 80 నుండి 130 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

ప్రపంచంలో మూడింట ఒక వంతు చిరుత పులులలో నమీబియాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాఖండంలోని దక్షిణాఫ్రికా, నమీబియ దేశాల నుంచి 16 చిరుత పులులను భార‌త్ కు తీసుక రాగా.. ఇందులో ఆరు ఆడ చిరుత‌లు ఉన్నాయి. వీటిని త‌ర‌లించే క్ర‌మంలో వాటికి అన్ని విధాల‌ వైద్య పరీక్షలు నిర్వహించి ఇన్ ఫెక్షన్లు రాకుండా యాంటీ బయోటిక్స్  ఇస్తారు. అలాగే.. డీఎన్ఏ విశ్లేషణ కోసం.. బ్లేడ్ శాంపిల్స్ ను సేక‌రిస్తారు. 
 
వీటిని భార‌త్ కు తీసుక‌వ‌చ్చాక  కూడా దాదాపు  నెల రోజుల పాటు కూనో నేషనల్ పార్క్ లోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచుతారు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను అల‌వాటు ప‌డిన త‌రువాత‌..  వీటిని 11,500 హెక్టార్ల   జాతీయ పార్కులో వీటిని వీడిచిపెట్ట‌నున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చిరుతలను సువిశాల‌మైన  ఐదు చదరపు కిలోమీటర్ల ఎన్‌క్లోజర్‌లోకి ఆరు చిరుతలు విడిచిపెడుతారని అటవీ అధికారులు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) JS చౌహాన్ మాట్లాడుతూ.. విదేశాల నుండి రాబోయే.. చిరుతలను ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 'సాఫ్ట్ రిలీజ్ ఎన్‌క్లోజర్'లో విడుదల చేయబోతున్నామని తెలిపారు. రెండు నుండి మూడు నెలల వరకు ఫెన్సింగ్‌ను బహిరంగ అడవిలోకి విడుదల చేస్తామ‌ని, ఈ క్ర‌మంలో ఆహారం కోసం దాదాపు250 జింక‌ల‌ను చిరుత‌ల కోసం విడిచిపెట్ట‌నున్న‌ట్టు తెలిపారు.  ఇక్కడి పర్యావరణంతో కలగలిసిన తర్వాత వాటిని ఎన్‌క్లోజర్ వెలుపల ఓపెన్ ఫారెస్ట్‌లోకి వదులుతారని తెలిపారు. 

ఈ చిరుతలను ఉంచేందుకు ఉద్దేశించిన ఎన్‌క్లోజర్‌లోకి ఆరు చిరుతలు ప్రవేశపెడుతామ‌ని చౌహాన్ తెలిపారు. ఎన్‌క్లోజర్‌లో నుంచి రెండు చిరుతపులిలను బయటకు తీశామని, మిగిలిన నాలుగింటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ చిరుతలను పట్టుకునేందుకు ఎరతో కూడిన బోనులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కునో-పాల్పూర్ నేషనల్ పార్క్‌లో పెద్ద సంఖ్యలో చిరుతపులులు ఉన్నాయని చౌహాన్ చెప్పారు.

click me!