లాక్‌డౌన్ ఎఫెక్ట్: కావడిలో పిల్లలను మోస్తూ 160 కి.మీ. కాలినడకనే ఇంటికి

By narsimha lode  |  First Published May 17, 2020, 5:42 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో  తన  స్వంత ఊరికి వెళ్లేందుకు వలస కార్మికుడు కావడిని తయారు చేసి తన ఇద్దరు కొడుకులను మోసుకొంటూ వెళ్లాడు. సుమారు 160 కి.మీ దూరం కావడిపై, ఇద్దరు బిడ్డలను మోసుకొంటూ ఇంటికి చేరుకొన్నాడు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి.


న్యూఢిల్లీ:లాక్ డౌన్ నేపథ్యంలో  తన  స్వంత ఊరికి వెళ్లేందుకు వలస కార్మికుడు కావడిని తయారు చేసి తన ఇద్దరు కొడుకులను మోసుకొంటూ వెళ్లాడు. సుమారు 160 కి.మీ దూరం కావడిపై, ఇద్దరు బిడ్డలను మోసుకొంటూ ఇంటికి చేరుకొన్నాడు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి.

ఒడిశా రాష్ట్రంలో మయూరుభంజ్ జిల్లా మోరాడా బ్లాక్ పరిధిలో గల బలాడియా గ్రామానికి చెందిన తుడు అనే గిరిజనుడు వలస కూలీ. ఉపాధి కోసం భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రాజస్థాన్ రాష్ట్రంలోని పనికోయిలి గ్రామానికి ఆయన వలస వెళ్లాడు. ఇక్కడ ఇటుక బట్టిలో పనిచేసేందుకు కుటుంబంతో కలిసి ఆయన వలస వెళ్లాడు. 

Latest Videos

also read:దేశంలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు: మరికొద్దిసేపట్లో మార్గదర్శకాలు విడుదల

లాక్ డౌన్ నేపథ్యంలో ఇటుక బట్టీ పనులు కూడ నిలిచిపోయాయి. ఉపాధి లేకుండా పోయింది. ఇక చేసేదిలేక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకొన్నాడు. అయితే రవాణా సౌకర్యం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్లను ఏర్పాటు చేసి వలస కార్మికులు తమ స్వగ్రామాలకు పంపుతున్నారు. అయితే తుడు మాత్రం కాలినడక ద్వారానే ఇంటికి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నాడు.

రాజస్థాన్ లో తాను ఉంటున్న ప్రాంతం నుండి తన స్వంత గ్రామానికి వెళ్లాలంటే సుమారు 160 కి.మీ నడవాల్సిందే.  ఆరేళ్ల కూతురు తన భార్యతో కలిసి కాలినడకన ప్రయాణం చేస్తోంది. తుడు భార్య మాత్రిక,ఆరేళ్ల కూతురు పుష్పాంజలి మాత్రం నడుస్తారు. మరో వైపు మరో వైపు నాలుగేళ్ల, రెండున్నర ఏళ్ల పిల్లలు నడిచే పరిస్థితులు లేవు.

also read:ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి: నిర్మలా సీతారామన్

దీంతో ఏం చేయాలో అర్ధం కాలేదు తుడుకు. అయితే ఆయనకు ఆ సమయంలో ఓ ఆలోచన వచ్చింది. కావడిని తయారు చేసి ఒక్క వైపు ఇద్దరు పిల్లలను మరోవైపు కొంత సామానును వేశాడు. కావడిని తన భుజాలపై మోసుకొంటూ ఈ నెల 8వ తేదీన కాలినడకన బయలుదేరాడు. ఈ నెల 15వ తేదీన తుడు తన కుటుంబసభ్యులతో కలిసి తన స్వగ్రామానికి చేరుకొన్నాడు.

ఇతర ప్రాంతం నుండి వచ్చినందున తుడుతో పాటు ఆ కుటుంబాన్ని గ్రామంలో క్వారంటైన్ కు తరలించారు అధికారులు. ఆ క్వారంటైన్ సెంటర్ లో సరైన భోజన వసతులు లేవు. ఈ విషయం తెలిసిన కొందరు స్థానికులు క్వారంటైన్ సెంటర్ లో ఉన్నవారికి భోజన వసతిని కల్పించారు. 
 

click me!