రేపటి నుంచి లాక్‌డౌన్ -4 .... గతం కంటే భిన్నం, సడలింపులు ఇవేనా..?

By Siva Kodati  |  First Published May 17, 2020, 5:28 PM IST

దేశంలో కరోనా తీవ్రత దృష్యా లాక్‌డౌన్ 4కు సిద్ధంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో విడత లాక్‌డౌన్ గడువు నేటితో ముగియనుంది. దేశంలో కరోనా కేసులు లక్షకు చేరువవుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి లాక్‌డౌన్ 4 మొదలుకానుంది. 


దేశంలో కరోనా తీవ్రత దృష్యా లాక్‌డౌన్ 4కు సిద్ధంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో విడత లాక్‌డౌన్ గడువు నేటితో ముగియనుంది.

దేశంలో కరోనా కేసులు లక్షకు చేరువవుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి లాక్‌డౌన్ 4 మొదలుకానుంది. అయితే ఈసారి గతంలో కంటే లాక్‌డౌన్ భిన్నంగా ఉండనుంది. ఆర్ధిక వ్యవస్ధకు జవసత్వాలు కలిగించేందుకు కేంద్రం పలు సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. 

Latest Videos

ఆ సడలింపులు ఏంటో ఒకసారి చూస్తే:

* నాలుగో విడత లాక్‌డౌన్ మే 31 వరకు ఉండే అవకాశం ఉంది.
* గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం
* ఇప్పటికే పరిమిత సంఖ్యలో రైళ్లకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. ప్రజా రవాణాకు సంబంధించి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది
* పౌర విమాన సేవలు, రోడ్డు రవాణా సహా మెట్రో సర్వీసులు నడిచే విధంగా సడలింపులు ఈ దశలో ఉంటాయని సమాచారం.
* షాపింగ్ మాల్స్‌ను సరి బేసి విధానంలో పాక్షికంగా తెరిచే అవకాశం
* నగరాల్లో కంటైన్‌మెంట్ జోన్లలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నిర్మాణ రంగ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం వుంది.

click me!