ఒడిశా రైలు ప్రమాద ఘటన మీద రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంంద్ర మోడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఒడిశా : ఒడిశా రైలు ప్రమాదం మీద రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంంద్ర మోడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ సంతాపం తెలిపారు. కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ శనివారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాద కారణాల మీద ఆరా తీశారు. ప్రమాదం మీద ఉన్నత స్తాయి విచారణకు ఆదేశించారు. విచారణ తరువాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ రెస్క్యూ ఆపరేషన్ ను పరిశీలించారు. ప్రమాదంలోని క్షతగాత్రులను రక్షించడానికి, మృతులను తరలించడానికి 250 అంబులెన్సులు.. 68 బస్సులు పనిచేస్తున్నాయి.
రాత్రి వరకు ఈ సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇంకా భోగీల్లో మృతదేహాలు ఉన్నట్టుగా తెలిపారు. ఒడిశా ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో 120 మంది తెలుగు ప్రయాణికులు ఉన్నారు.
ఒడిశా రైలు ప్రమాదం : 233 కు చేరిన మృతులు.. 48 రైళ్లు రద్దు, 38 రైళ్ల దారి మళ్లింపు..
ఒడిశా రైలు ప్రమాదంపై వివిధ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.. షాలిమార్, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం,తిరుపతి,బాలాసోర్, సికింద్రాబాద్,విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం,బాపట్ల,తెనాలి,నెల్లూరు, ఒంగోలు,రేణిగుంటలకు హెల్స్ లైన్లు ఏర్పాటు చేశారు.