ఒడిశా రైలు ప్రమాదం.. నేడు సంతాప దినంగా ప్రకటించిన నవీన్ పట్నాయక్

Published : Jun 03, 2023, 07:56 AM IST
ఒడిశా రైలు ప్రమాదం.. నేడు సంతాప దినంగా ప్రకటించిన నవీన్ పట్నాయక్

సారాంశం

ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు ఆ రాష్ట్రం సంతాప దినంగా పాటించనుంది. ఈరోజు అధికారిక వేడుకలు, వినోద కార్యక్రమాలు ఉండవని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భయంకరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రంలో శనివారం ఒక రోజు సంతాప దినంగా పాటించాలని ప్రకటించారు. ‘‘బహనాగా వద్ద ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో సీఎం నవీన్ పట్నాయక్ ఒక రోజు సంతాప దినంగా పాటించాలని ఆదేశించారు. అందువల్ల జూన్ 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి వేడుకలూ జరగవు’’ అని ఒడిశా ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ ట్వీట్ చేసింది.

హిజాబ్ వివాదం.. గంగా-జమునా పాఠశాల గుర్తింపును రద్దు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఇప్పటి వరకు ఈ ఘటనలో 233 మరణించినట్టు తేలిందని అధికారులు చెబుతున్నారు. 900 మంది గాయపడ్డారని ఒడిశా చీఫ్ సెక్రటరీ తాజాగా నివేదికను విడుదల చేశారు. ‘‘కోల్ కతాకు దక్షిణంగా 250 కిలోమీటర్లు, భువనేశ్వర్ కు ఉత్తరాన 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాసోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరింది. సుమారు 900 మంది గాయపడ్డారు’’ అని ఆ నివేదిక లో పేర్కొన్నారు

ప్రమాదంలో గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహూ ప్రకటించారు. ప్రమాద బాధితులకు అవసరమైన సమయంలో రక్తదానం చేసిన వాలంటీర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెనా ట్విటర్ లో కృతజ్ఞతలు తెలిపారు ‘‘ఈ ప్రమాద బాధితుల కోసం బాలాసోర్ లో రాత్రికి రాత్రే ఐదు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ప్రస్తుతం తొమ్మిది వందల యూనిట్లు స్టాక్ లో ఉన్నాయి. ఇది ప్రమాద బాధితులకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది. ఒక ఉదాత్తమైన లక్ష్యం కోసం రక్తదానం చేసిన వాలంటీర్లందరికీ నేను వ్యక్తిగతంగా రుణపడి ఉంటాను’’ అని జెనా అన్నారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన మయవతి .. ఇంతకీ ఏమన్నారంటే..?

ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడటంలో సహాయం చేయడానికి వైమానిక దళాన్ని పిలిపించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ‘‘ఒడిశాలోని ఘటనా స్థలానికి చేరుకున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భువనేశ్వర్, కోల్కతా నుంచి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు, వైమానిక దళం కూడా రంగంలోకి దిగాయి. సహాయక చర్యలకు అవసరమైన అన్ని చేతులు తీసుకుంటాను’’ అని ట్వీట్ చేశారు.

5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ షురూ : ఉద్యోగుల బదిలీలకు ఆదేశం, ఇలాంటి వారు వుండొద్దు .. సీఎస్‌లకు ఈసీ ఆదేశం

కాగా.. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు నష్టపరిహారం ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులతో కలిసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఆగ్నేయ రైల్వే ఖరగ్ పూర్ డివిజన్ లోని హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు 18 సుదూర రైళ్లను రద్దు చేశారు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu