హెచ్ఆర్‌డీ మినిస్ట్రీ ఇక విద్యా మంత్రిత్వ శాఖ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Jul 29, 2020, 1:22 PM IST
Highlights

హెచ్ఆర్‌డీ మంత్రిత్వశాఖ పేరును విద్యాశాఖగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బుధవారం నాడు  కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది.

న్యూఢిల్లీ: హెచ్ఆర్‌డీ మంత్రిత్వశాఖ పేరును విద్యాశాఖగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బుధవారం నాడు  కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో  నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ని ఆమోదించింది కేబినెట్. విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేలా పాలసీని రూపొందించారు. నాలుగు దశల్లో జాతీయ విద్యా విధానం ఉంటుంది. 

కొత్త పాలసీ ప్రకారంగా విద్యా విధానం, విద్యా బోధనలో మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర స్థాయిల్లో స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు.పీవీ నరసింహారావు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యాశాఖ పేరును హెచ్ ఆర్ డీ శాఖగా మార్చారు. 

గత ఏడాది మే 31వ తేదీన కస్తూరి రంగన్ కమిటి నేతృత్వంలో కమిటి ఎన్‌ఈపీ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వానికి అందించింది.ఈ ముసాయిదాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ సాయంత్రం  కేంద్ర మంత్రులు కేబినెట్ లో తీసుకొన్న నిర్ణయాలను మీడియాకు వివరించనున్నారు.

click me!